బుద్ది లేదా అంటూ స్టార్ పై నెటిజన్స్ ఫైర్

0

స్టార్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది ఏదైనా నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. స్టార్స్ పొరపాటున ఏదైనా చిన్న తప్పును సోషల్ మీడియాలో చేస్తే వారు భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు తెలియక పొరపాటున పోస్ట్ చేసి ట్రోల్స్ ఎదురవ్వడంతో వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేస్తారు. కొందరు మాత్రం ట్రోల్స్ వస్తున్నా కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ రిషీ కపూర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనపై దుమ్మెత్తి పోసేలా చేస్తోంది.

దసరా సందర్బంగా హిందువులు ఆయుద పూజ చేస్తారు. వెయికిల్స్ లేదంటే తమ వృత్తికి సంబంధించిన వస్తువులకు పూజలు నిర్వహించడం చేస్తారు. అయితే దసరా రోజు తన ఆయుదం అంటూ ఓపెనర్ కు రిషి కపూర్ ఆయుద పూజ చేయడంతో పాటు ఆ ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. బీర్.. సోడా కొన్ని కూల్ డ్రింగ్స్ ఓపెన్ చేసేందుకు ఉపయోగించే ఓపెనర్ ను తన ఆయుదం అంటూ రిషి కపూర్ పేర్కొనడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియాలో రిషి కపూర్ పై ట్రోల్స్ తెగ వస్తున్నాయి. నువ్వో పెద్ద స్టార్ అనే విషయాన్ని మర్చి పోయి మరీ ఇంత చిల్లగా వ్యవహరించడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు పండుగ రోజు ఇలాంటి పోస్ట్ లు పెట్టేందుకు కనీసం నీకు బుద్ది లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషి కపూర్ గతంలో కూడా ఇలా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా కామెడీగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాడు. ఆ సమయంలో కూడా రిషిని తీవ్రంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు.

గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డ రిషి కపూర్ అమెరికాలో దాదాపు 11 నెలల పాటు చికిత్స పొంది ఇటీవలే ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో విహార యాత్రలో ఉన్న రిషి కపూర్ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ నటించేందుకు సిద్దం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రిషి కపూర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ లు పెట్టడంతో తన పరువు తానే తీసుకున్నవాడు అవుతున్నాడు.
Please Read Disclaimer