రీతూ పాపకు ఇకనైనా తెలుగు ఛాన్సులు?

0

`ప్రేమ ఇష్క్ కాదల్` చిత్రంతో తెలుగమ్మాయి రీతూవర్మ టాలీవుడ్ కి పరిచచయమైన సంగతి తెలిసిందే. అటుపై `ఎవడే సుబ్రమణ్యం` చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు అమ్మడికి అంతగా గుర్తింపునివ్వలేదు. అదే సమయంలో విజయ్ దేవరకొండ హీరోగా పరియమైన `పెళ్లి చూపులు` చిత్రంలో సోలో నాయికగా ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా సక్సెస్ తో ఇద్దరికీ మంచి బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే. హీరోగా దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయాడు. అయితే రీతూ వర్మ మాత్రం అవకాశాలు అందుకున్నా విజయాలు దక్కించుకోవడంలో విఫలమైంది.

దీంతో కొన్నాళ్ల పాటు తమిళ సినిమాలవైపు మనసు మళ్లించింది. అక్కడా ఈ కటౌట్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. బేసిక్ గానే సన్నజాజి సోయగాల్ని కోలీవుడ్ అభిమానులు అంతగా ఆదరించరు కాబట్టి! ఆ కోవలో మళ్లీ టాలీవుడ్ కే కంబ్యాక్ అవ్వాల్సి వచ్చింది. అయినా ఏం లాభం. ఇక్కడ అమ్మడిని ప్రోత్సహించేది ఎవరు? పిలిచి అవకాశాలిచ్చే నాధుడేడీ.. అంటే ఏ ఒక్కరు లేరనే చెప్పాలి. తెలుగు అమ్మాయి అయినా మాతృభాష అమ్మడికి ఏవిధంగానూ కలిసి రావడం లేదు. రీతూని పట్టించుకోక పోవడానికి కారణం ఆ కటౌటే హీరోయిన్ మెటీరియల్ కానే కాదన్న విమర్శ ఎదుర్కొంటోంది. అందుకే అవకాశాలు అందుకోవడం విఫలమవుతుందని అంటున్నారు.

ఇటీవలే మలయాళ అనువాదం `కనులు కనులను దోచాయంటే` చిత్రంలో దుల్కార్ సల్మాన్ సరసన కనిపించింది. అయినా ఏం లాభం లేదు. సినిమా రిలీజ్ అయిందన్న విషయం కూడా పెద్దగా తెలియకుండా పోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి విజయ్ దేవరకొండ ఏమైనా అవకాశం ఇచ్చి ఆదుకుంటాడేమో చూడాలి. అయితే నాని చిత్రం `టక్ జగదీష్` లో… శర్వానంద్ కొత్త సినిమా లో నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer