మూడు సినిమాలతో జోరు పెంచేసింది

0

కొందరు హీరోయిన్స్ రెండు మూడు సినిమాలకే కనుమరుగైపోతారు. అదే లిస్టులోకి వస్తుంది రీతు వర్మ. ‘పెళ్లి చూపులు’ తర్వాత రీతు పాపులర్ హీరోయిన్స్ లిస్టులో చేరుతుందని ఊహించరందరూ. కానీ ఆ సినిమా తర్వాత ఏదో అడపాదడపా సినిమాలు చేసి మెల్లగా కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది రీతు. ఇక తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్తుందేమో అనుకుంటున్న సమయంలో మూడు సినిమాలు పట్టేసి బిజీ హీరోయిన్ అయిపొయింది.

అవును ఇప్పుడు రీతు వర్మ చేతిలో మూడు సినిమాలున్నాయి. అవి కూడా అల్లాటప్పా సినిమాలు కావు. మంచి కాంబినేషన్స్ లో వస్తున్న సినిమాలే. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న బైలింగ్వెల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ లేటెస్ట్ గా నాని టక్ జగదీశ్ లో ఛాన్స్ కొట్టేసింది.

ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో సినిమా కూడా ఓకే చేసుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. నాగ శౌర్య తో సౌజన్య అనే మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తున్న సినిమాలో రీతు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇలా మూడు సినిమాలతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకులను పలకరించి మినిమం రేంజ్ ఉన్న హీరోయిన్స్ లిస్టులోకి వెళ్ళబోతుంది. మరి ఈ మూడు సినిమాలు అమ్మడికి ఎలాంటి హిట్స్ అందిస్తాయో చూడాలి.
Please Read Disclaimer