బాత్ టబ్ లో బుక్ అయిపోయింది

0

సోషల్ మీడియా ప్రచారం పెనుపోకడలు పోతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రతిదానికి ఉచిత ప్రచారం సాధ్యమవుతోంది. దీంతో అందాల కథానాయికలు నిరంతరం ఏదో ఒక ఫోటోషూట్ తో వేడెక్కిస్తూ అభిమానులకు టచ్ లోకి వస్తున్నారు. కొందరు మర్చిపోయిన కథానాయికలు సైతం తమ ఉనికిని చాటుకునేందుకు పడుతున్న ప్రయాస మామూలుగా లేదు.

ఇక మంచు మనోజ్ హీరోయిన్ రియా సేన్ పాట్లు చూశారా? అపుడెపుడో నేను మీకు తెలుసా? అనే చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమా ఫ్లాపవ్వడంతో తిరిగి ఇక్కడ కనిపించలేదు. అటుపై బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినా అక్కడా అంతంత మాత్రమే. అయినా తిరిగి తెలుగు సినిమాల్లో ట్రై చేసిందే లేదు. హిందీ పరిశ్రమలోనూ ఈ అమ్మడికి కంబ్యాక్ ఛాన్స్ లేనేలేదు. అందుకే ఇటీవల సోషల్ మీడియా ద్వారా మాత్రమే అభిమానులకు టచ్ లో ఉంటోంది.

తాజాగా బాత్ టబ్ లో హాట్ ఫోటోషూట్ తో ఫ్యాన్స్ కి టచ్ లోకి వచ్చింది. నీళ్లు లేకుండా ఖాళీగా ఉన్న స్నానాల టబ్ లో ఆదమరిచి ఫోన్ లోకి చూస్తోంది. అలా చూస్తున్నప్పుడు థై సొగసుల్ని గాలికి వదిలేసింది. ఆ పింక్ బికినీలో సమ్మోహనాల మోహినిని తలపిస్తోంది. ఇంతకీ బాత్ టబ్ లో తాను బుక్ అయ్యిందా లేక తననే చూస్తున్న వారిని బుక్ చేసిందా? అన్నది తేలాల్సి ఉంది.
Please Read Disclaimer