అయ్యో మన హీరోలు ఎవరు అందగాళ్లు కాదా?

0

తమిళ హీరోలు అందంగా ఉండరు మా హీరోలు చాలా అందంగా ఉంటారు.. తెలుగు హీరోలు ఉన్నంత అందంగా బాలీవుడ్ హీరోలు కూడా ఉండరంటూ కొందరు తెలుగు సినిమా ప్రేమికులు.. ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అయితే ఇతర భాషల హీరోలతో పోల్చితే ముఖ్యంగా తమిళం.. కన్నడం భాషల హీరోలతో పోల్చితే మన హీరోలు చాలా చాలా బెటర్ అనే విషయం అంతా ఒప్పుకోవాల్సిన విషయం. కాని మన హీరోలను మించిన అందగాళ్లు ఉన్నారు. వారి అందం ముందు మన హీరోల అందం జుజుబీ.

అందంకు ఒక కొలత ఉంటుంది.. దానికో లెక్క ఉంటుంది. దాని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అందగాడు ఎవరు అంటే బ్రిటన్ కు చెందిన రాబర్ట్ ప్యాటిన్సన్. గోల్డెన్ రేషియో ఆధారంగా అందంను లెక్కిస్తారు. కంప్యూటర్ మ్యాపింగ్ లో కళ్లు.. కనుబొమ్మలు.. పెదాలు.. నుదురు.. బుగ్గలు.. ఇలా పలు పార్ట్ లకు వేరు వేరుగా రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రేటింగ్ లో రాబర్ట్ కు అత్యధిక సరాసరి మార్కులు దక్కాయి.

రాబర్ట్ నుదురుకు 93.6.. కళ్లు 94.7.. ముక్కు 94.67.. గదమ 95.1.. మొహం రూపు 91.1.. ముక్కు 89.4.. పెదాలు 82 మార్కులను దక్కించుకున్నాయి. వీటన్నింటి సరాసరి చేస్తే ఇతగాడి మార్కులు 92.15. ఈ మార్కులతో ప్రపంచంలోనే అత్యంత అందగాడిగా ఇతడు నిలిచాడు. ఇతడి తర్వాత స్థానంలో 91.64 మార్కులతో హాలీవుడ్ నటుడు హెన్రీ కెవిల్ నిలిచాడు. ఇక మూడవ స్థానంలో బ్రాడ్లీ కూపర్ 91.08 మార్కులతో ఉన్నాడు.

టాప్ 10 కనీసం ఒక్క ఇండియన్ కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. ఇన్ని కోట్ల మంది భారతీయుల్లో వారి స్థాయి అందగాడు లేకపోయాడు. ఈ లెక్కలు చూసిన తర్వాత అయ్యో మన హీరోలు అందగాళ్లు కాదా అని బాధ పడనక్కర్లేదు. ఎందుకంటే వారు అందంగా ఉంటే మనోళ్లలో హీరోయిజం ఉంటుంది. చూడగానే ఒక కళ మనోళ్లలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకే మనోళ్లు ఆ జాబితాలో లేరే అనే అవమానం అక్కర్లేదు.