సూపర్ హీరో సిరీస్ తో పీసీ కంబ్యాక్

0

నిక్ జోనాస్ ని పెళ్లాడిన తర్వాత ప్రియాంక చోప్రా పూర్తిగా ఫ్యామిలీ ఎఫైర్స్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం విదేశీ విహారాలతో ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ జోడీ బిజీబిజీగా ఉన్నారు. `లైఫ్ ఈజ్ సెలబ్రేషన్` అన్న తీరుగా జాలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆ ఫోటోలు- వీడియోలు అభిమానులకు షేర్ చేస్తున్నారు. అంతవరకూ ఓకే కానీ కథానాయికగా పీసీ కెరీర్ మాటేమిటి? ఇకపై అయినా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా? అంటే అందుకు సంబంధించి తాజాగా సమాచారం అందింది.

`క్వాంటికో` వెబ్ సిరీస్ తో ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకుంది. ఆ తర్వాత డ్వేన్ జాన్సన్ `బేవాచ్`లో కథానాయికగా నటించింది. అటుపై నిక్ జోనాస్ తో ప్రేమాయణం.. పెళ్లి ఆలోచనలతో సల్మాన్ `భారత్` చిత్రంలో అవకాశాన్ని వదులుకుంది. ప్రస్తుతం పీసీ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న సూపర్ హీరో ఫిలిం `వియ్ కెన్ బి హీరోస్`లో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్ర పోషించనుంది.

ఈ సినిమా కథాంశం ఆసక్తి రేకెత్తించేదే. ఈ భూమ్మీద ఉన్న సూపర్ హీరోస్ అందరినీ ఏలియన్స్ బంధించేసి లోక వినాశనానికి తెరతీస్తే ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకు కొందరు చిన్నారులు చేసిన ప్రయత్నం ఎలాంటిది? అన్నదే కథాంశం. అకీరా ఫిన్లే-నాథన్ బ్లెయిర్- ఆండీ వాకెన్- హలా ఫిన్లే తదితరులు నటిస్తున్నారు. స్పై కిడ్స్- సిన్ సిటీ లాంటి భారీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోబర్ట్ రోడ్రిగ్ `వియ్ కెన్ బి హీరోస్`కి దర్శకత్వం వహించనున్నారు. ఈ హాలీవుడ్ సినిమాతో పాటుగా `ది స్కై ఈజ్ పింక్` అనే బాలీవుడ్ చిత్రంలోనూ పీసీ నటిస్తోంది. ఇందులో ఫర్హాన్ అక్తర్- జైరా వాసిమ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home