రాకర్స్ రాంగ్ ట్రాక్.. దర్బార్ కు దిమ్మ తిరిగే షాక్..

0

కొన్నేళ్లుగా తనదైన హిట్ లేక అవస్థలు పడుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి తన ఆశలన్ని ప్రముఖ దర్శకుడు మురుగదాస్ మీద పెట్టుకున్నాడు. చిత్రం ఏదైనా.. తనదైన ట్రీట్ మెంట్ తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లే ఆయనతో సినిమా అన్నంతనే అంచనాలన్ని ఓ స్థాయిలో ఉంటాయి.

సంక్రాంతి రేసులోకి వచ్చిన దర్బార్.. మిగిలిన అన్ని చిత్రాల కంటే కాస్త ముందుగా థియేటర్ల కు వచ్చేసింది. జనరల్ పబ్లిక్ టాక్ కు.. రివ్యూలు ఇచ్చిన తీర్పులకు సంబంధం లేని రీతిలో ఉండటం ఒక విశేషంగా చెప్పాలి. తొలి రోజు దర్బార్ కలెక్షన్లకు ఢోకా లేదన్నట్లుగా ఫిగర్స్ చెబుతున్నా.. మరోవైపు నుంచి ప్రమాదం మీదకు వచ్చి పడింది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్బార్ ను.. విడుదలైన గంటల వ్యవధిలోనే భారీ షాకిచ్చారు తమిళ్ రాకర్స్.

పెద్ద.. చిన్న అన్న తేడా లేకుండా క్రేజీ సినిమాల్ని రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే సినిమాను పైరసీతో ఆన్ లైన్ లో ఆప్ లోడ్ చేసే మాదిరే.. దర్బార్ విషయంలోనూ అదే చేశారు. తమిళ్ రాకర్స్ పేరుతో దర్బార్ మూవీ రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే సినిమా మొత్తాన్నికాపీ చేసి.. ఆన్ లైన్ లోకి వదిలారు.

దీంతో చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. సంక్రాంతికి వచ్చిన రజనీ సినిమా కావటం.. దానికి మురుగదాస్ లాంటి దర్శకుుడు తోడు కావటంతో ఈ సినిమా బిజినెస్ భారీగా సాగింది. అయితే.. సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే పైరసీ చేసి.. సినిమా మొత్తాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన వైనం కలకలం రేపుతోంది. సినిమా ఏదైనా విడుదలైన గంటల వ్యవధిలోనే సినిమాను ఆన్ లైన్ లో దర్శనమిచ్చేలా చేయటం తమిళ్ రాకర్స్ కు అలవాటే. తాజాగా తమ మార్క్ ను ప్రదర్శించటం ద్వారా దర్బార్ చిత్ర యూనిట్ కు దిమ్మ తిరిగే షాకిచ్చారు. దీంతో దీన్ని డిలీట్ చేసేందుకు ఏమేం చేయాలో అవన్ని చేస్తునట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer