లేడీ బాస్ తర్వాత ఫైర్ బ్రాండ్ బరిలోకి!

0

సీనియర్ నటీమణులు ఒక్కొక్కరుగా తిరిగి రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. రంగుల ప్రపంచంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించి నేము ఫేమ్ ఎటూ పోకుండా ప్లాన్ తోనే బరిలోకొస్తున్నారు. ఈ కేటగిరీలో ఇప్పటికే పలువురు సీనియర్ కథానాయికలు చేరారు. తాజాగా మేటి నటి రోజా వంతు.

యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను.. నటి రోజాను ఓ పాత్ర కోసం సంప్రదించారన్నది తాజా అప్ డేట్. తన సినిమాల్లో కీలక పాత్రల కోసం సీనియర్ నటుల్ని ఎంపిక చేసుకుని వారిని కొత్త కోణంలో ప్రజెంట్ చేయడంలో బోయపాటిది ప్రత్యేక శైలి. ‘భద్ర’లో ప్రకాష్ రాజ్ ని పాజిటివ్ గా చూపించిన బోయపాటి ఆ తరువాత సినిమాల్లోనూ అదే పంథాను ఫాలో అయ్యారు. ‘లెజెండ్’ సినిమాతో ఫ్యామిలీ హీరో జగపతిబాబుని బ్యాడ్ మ్యాన్ గా ప్రజెంట్ చేసి అతనికి కొత్త కెరీర్ ని అందించాడు. తాజాగా బాలయ్యతో చేయబోతున్నసినిమా ద్వారా సీనియర్ హీరోయిన్.. వైసీపీ నేత రోజాను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేయబోతున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కలయికలో సింహా.. లెజెండ్ చిత్రాల తరువాత మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఓ భారీ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ఇప్పటికే `రూలర్` అనే టైటిల్ ప్రచారంలో వుంది. త్వరలో సెట్స్పైకి రాబోతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఇటీవలే దర్శకుడు బోయపాటి శ్రీను నటి రోజాను సంప్రదించారని… నెగెటివ్ టచ్ తో సాగే పాజిటివ్ పాత్ర కావడం.. నటనకు ఆస్కారం వున్న పాత్ర కావడంతో రోజా కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవలే లేడీ బాస్ విజయశాంతి రీఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. ఈలోగానే మరో సీనియర్ నటి రోజా బరిలో దిగుతున్నారు అన్నది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్. రవికుమార్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వెరైటీ గెటప్ తో ఈ చిత్రంలో బాలయ్య కనిపించబోతున్నారు. సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్.. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ప్లాన్ చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
Please Read Disclaimer