పవన్ కళ్యాణ్ గుండుపై రోజా కామెంట్.. పూనమ్ లైక్

0

అప్పట్లో టీడీపీ సీమ ఫైర్ బ్రాండ్ నేత పరిటాల రవిని ఎదురించాడని హీరో పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారనే ప్రచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించాడు. తాను తమ్ముడు సినిమా షూటింగ్ కోసం గుండు కొట్టించుకున్నానని.. తాను పరిటాల రవిని ఒక్కసారి కూడా కలువలేదని స్పష్టం చేశారు. అయినా ఆ వివాదాల సడి పోవడం లేదు.

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు గుండు కొట్టించింది టీడీపీ అని.. 2014లో కూడా పవన్ కు గుండు కొట్టించిందని.. 2019లో ఎన్నికల్లో కూడా పవన్ కు గుండును టీడీపీయే కొట్టిస్తుందని సెటైర్లు వేసింది.

రోజా గతంలో పవన్ గుండు గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు మరోసారి హల్ చల్ చేస్తోంది. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. వీడియోను చూసి హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా లైక్ చేయడం గమనార్హం.

ఇదివరకు పవన్ కళ్యాణ్ పై పరుష విమర్శలు చేసి.. అతడిని వెనకేసుకొచ్చి ప్రేమను కోపాన్ని చూపించిన పూనమ్ కౌర్.. తాజాగా పవన్ కు గుండు కొట్టించే వ్యాఖ్యలను లైక్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Please Read Disclaimer