బన్నీ కోసం నాటి హీరోయిన్ విలన్ కాబోతుందా..?

0

ఇటీవలే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత స్టైలిష్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో ఆర్య ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న పుష్ప మీద ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయిదు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అన్న టాక్ బాగా సాగుతుంది. ఇక సుకుమార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకోవాలని చాలా కష్టపడుతున్నారట. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నారు. బన్నీకి జోడీగా రష్మిక మందన్న కనిపించబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే షూటింగ్లకు అనుమతి ఇవ్వడంతో త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు సుకుమార్. అయితే ఇందులో విలన్ పాత్రకు విజయ్ సేతుపతి బాబీ సునీల్ శెట్టి ఇలా పలువురి పేర్లు వినిపించాయి. కానీ ఈ మూవీలో మరో పవర్ ఫుల్ పాత్ర ఉందట.. అదే లేడీ విలన్.

ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం నటి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజాను సుకుమార్ ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాకి ఆమె పాత్రకు సంబంధించి ఇప్పటికే రోజాను సంప్రదించడం పాత్ర నచ్చి సినిమాలో నటించేందుకు రోజా ఒప్పుకోవడం జరిగిపోయాయని సమాచారం. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత రోజా ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన రోజా.. ఆ తర్వాత ప్రత్యేక పాత్రల్లో మెప్పించారు. బన్నీ సినిమాకు రోజా నిజంగానే ఓకే చెప్పి ఉంటే టాలీవుడ్లో రేర్ కాంబినేషన్ ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. అంతేకాదు రోజా విలనిజం గాంభీర్యం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప సినిమాకు రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే విడుదలైన పుష్ప పోస్టర్తో సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి. మరి బన్నీ వర్సెస్ రచ్చబండ కాంబినేషన్ ఏమవుతుందో చూడాలి!
Please Read Disclaimer