బాలయ్య సినిమాలో విలన్ పాత్రకు రోజా అనాసక్తి?

0

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘రూలర్’ వచ్చేనెలలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తతం ప్రీ ప్రొడక్షన్ సాగుతోంది. కథకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసే పనిలో బోయపాటి బిజీగా ఉన్నారట. బోయపాటి తన సినిమాలకు క్యాస్టింగ్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా బోయపాటి సినిమాలో విలన్ పాత్రపై అందరి దృష్టి ఉంటుంది. ఈసారి కూడా అలానే విలన్ పాత్రకు కొత్తగా ఆలోచించారట.

సీనియర్ నటి రోజాను ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించారట. రోజా ప్రస్తుతం వైసిపీ నాయకురాలిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎంఎల్ఎ గానే కాకుండా ఎపీఐఐసి చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రోజా ఈ విలన్ ఆఫర్ ను స్వీకరించేందుకు సిద్ధంగా లేనని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. ఒకవైపు పొలిటికల్ కమిట్మెంట్లు.. మరోవైపు జబర్దస్త్ ప్రోగ్రామ్ తో బిజీగా ఉన్నానని చెప్పారట. అంతే కాకుండా బాలయ్య సినిమాలో విలన్ రోల్ చేయడం పట్ల రోజాకు పెద్దగా ఆసక్తి లేదని చెప్పారట. ఇలా అయితే బోయపాటి ఈ సినిమాలో విలన్ పాత్రకు మరో పవర్ఫుల్ నటికోసం సెర్చ్ చేయడం తప్పేలా లేదు.

బాలయ్య – బోయపాటి సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. లెజెండ్.. సింహా తర్వాత ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి అని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు.
Please Read Disclaimer