లవర్ బాయ్ కి సంబంధాలు చూస్తున్నారట

0

బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులు పరిచయం అయ్యి ఎన్నో సినిమాల్లో కీలక పాత్రను పోషించి చిన్నప్పుడే అందరికి సుపరిచితుడు అయిన తరుణ్ పెరిగి పెద్ద వాడు అయ్యి హీరోగా పరిచయం అయ్యాడు. హీరోగా పరిచయం అయిన కొంత కాలంకే స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో వరుసగా మంచి సక్సెస్ లు దక్కించుకున్నాడు. అయితే తరుణ్ కెరీర్ కొంత కాలంకే తిరోగమణం పట్టింది. తక్కువ సమయంలోనే తరుణ్ స్టార్ డం కాస్త చేజార్చుకున్నాడు. ప్రస్తుతం బిజినెస్ చూసుకుంటూ అడపా దడపా చిత్రాల్లో కనిపిస్తున్న తరుణ్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నట్లుగా తల్లి తల్లిగారు అయిన రోజా రమణి చెప్పుకొచ్చారు.

తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండపేట వెళ్లిన రోజా రమణి అక్కడ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా తన కొడుకు తరుణ్ గురించి మాట్లాడుతూ ఆమె పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తరుణ్ కు సూట్ అయ్యే మంచి అమ్మాయి కోసం తమ కుటుంబం చూస్తున్నట్లుగా పేర్కొంది. తరుణ్ కు సూట్ అయ్యి నచ్చిన అమ్మాయి దొరికన వెంటనే పెళ్లి చేస్తామంటూ రోజా రమణి పేర్కొన్నారు.

పెళ్లి ఫిక్స్ కాగానే తప్పకుండా మీడియా మిత్రులందరికి తెలియజేస్తానంటూ రోజా రమణి చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం తాను నటించడం లేదని కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగా మాత్రమే కొనసాగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. 130 సినిమాల్లో నటించిన తాను ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్లుగా ఈ సందర్బంగా రోజా రమణి అన్నారు.
Please Read Disclaimer