జబర్ధస్త్ కమెడియన్ కు రోజా సీరియస్ వార్నింగ్

0

తెలుగులోనే నంబర్ 1 షోగా కీర్తినందుకుంది జబర్ధస్త్ కామెడీ షో. ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకున్న ఈ షో కరోనా లాక్ డౌన్ తర్వాత మొదలైంది. తొలి జబర్ధస్త్ షోలో వివాదం చెలరేగింది. తాజాగా స్కిట్ లో భాగంగా కమెడియన్ ముక్కు అవినాష్ .. ఏపీలో మద్యం ధరలు బాగా పెరిగాయని.. లాక్ డౌన్ వేళ ఒక ఫుల్ బాటిల్ ను 9 వేలకు కొన్నానని పంచ్ వేశాడు. అయితే వెంటనే జడ్జిగా ఉన్న రోజా తేరుకొని మధ్యలోనే అవినాష్ కు కౌంటర్ ఇచ్చింది.

స్టేజ్ పైన కౌంటర్ ఇస్తూ.. ‘ఎవడు కొనమన్నాడురా నిన్ను అంత రేట్ పెట్టి.. తాగుబోతు సచ్చినోడా’ అంటూ ఈసడించుకున్నారు. ఆ రోజు షో తర్వాత కూడా అవినాష్ కు కాస్త క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.

ప్రభుత్వాలు విధానాలపై పంచ్ లు వేసే ముందు కొంచెం ఆలోచించి వేయండి అంటూ అవినాష్ తోపాటు మిగతా వారికి కూడా రోజా హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది.
Please Read Disclaimer