నువ్వు నీ భార్యను. నేను నా మొగుణ్ని తీసుకొద్దాం: జాఫర్ కు రోజా పంచ్

0

నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖ తెలుగు టీవీ చానెల్ నిర్వహించిన ‘ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే’ షో అలరించింది. అయితే ఇందులో అనూహ్యంగా వివాదాస్పద జర్నలిస్టు జాఫర్ ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. ఎమ్మెల్యే కం నటి రోజా జబర్ధస్త్ కమెడియన్లు హైపర్ ఆది సుడిగాలి సుధీర్ లను జాఫర్ ఇంటర్య్వూ చేశారు.

ఈ క్రమంలోనే రోజాపై జాఫర్ పలు వివాదాస్పద ప్రశ్నలతో ఇరికించాలని చూశారు. ‘‘రోజా టీవీ షోలకు ఎక్కువ సమయం.. జనానికి తక్కువ సమయం కేటాయిస్తోందని’’ ప్రశ్నించాడు. దీనికి రోజా జవాబుకు షో ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. ‘పని చేతగాని వాళ్లు మీడియా ను మేనేజ్ చేస్తారని.. పనిచేయడం తెలిసిన వాళ్లు టైం మేనేజ్ మెంట్ చేస్తారు.. అది నాలాగా’ అని కౌంటర్ ఇచ్చారు. ఇక భర్తతో రోజా ఎందుకు బయటకు రారు.. కనపడరని జాఫర్ ప్రశ్నిస్తే.. ‘మీరు భార్యతో ఈ షోకు రండి.. నేను మా భర్తతో వస్తాను’ అంటూ కౌంటర్ ఇచ్చారు రోజా.. అలా జాఫర్ నే ఉక్కిరిబిక్కిరి చేశారు..

ఇక హైపర్ ఆదిని ఇరికించాలనుకున్న జాఫర్ ఆటలు సాగలేదు. అనసూయని ఫ్లర్ట్ చేస్తున్నావా? కత్తి మహేష్ బాడీ షేమింగ్ చేస్తున్నావా? టీం లీడర్స్ కింద వాళ్లకు డబ్బులు ఇవ్వరట అన్న ప్రశ్నలకు అదిరిపోయే రీతిలో హైపర్ అది పంచ్ లు ఇచ్చి జాఫర్ నే ప్రశ్నలు ఉపసంహరించుకునేలా చేశారు.. సుధీర్ సైతం తనదైన కామెడీ పంచులతో సీరియస్ గా ప్రశ్నలేసిన జాఫర్ ను ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు ఈ సీరియస్ సరదా సంవాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Please Read Disclaimer