బాలయ్య మూవీ లో ఫైర్ బ్రాండ్ ఉరుములే

0

రియల్ లైఫ్ ఇమేజ్ ఒక్కోసారి ఊహించని అరుదైన అవకాశాల్ని తెచ్చిపెడుతుంటుంది. ఆ కోణంలోనే తాజాగా వైకాపా నాయకురాలు.. ఫైర్ బ్రాండ్ రోజా కు బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కిందట. ఇంతకీ ఆ రోల్ ఎలా ఉంటుంది? అంటే ఆసక్తి రేకెత్తించే సంగతులే తెలిశాయి.

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడి గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఎన్.బి.కె 106 ప్రీప్రొడక్షన్ పనులు చకచకా పూర్తవుతున్నాయి. డిసెంబర్ నుంచి సెట్స్ కి వెళ్లేందుకు అనుగుణంగా బోయపాటి వేగంగా అన్ని పనుల్ని ముగిస్తున్నారట. ఇప్పటికే బాలయ్య కు జోడీ గా ఇద్దరు భామల్ని ఎంపిక చేసాడు. నాయికల పేర్లు రివీల్ కావాల్సి ఉందింకా. ఇక బాలయ్య ను ఢీ కొట్టడానికి బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ ని బరిలోకి దింపుతున్నారన్న ప్రచ్రారంలో ఉంది. బోయపాటి మార్క్ మాస్ స్టోరీకి తగ్గట్టే.. ఇందులో హీరోయిజం… మాస్ విలనిజం పీక్స్ లో చూపిస్తున్నారట.

ఈ చిత్రం లో దత్ ఒక్కడే విలన్ కాదు. ఇందులో లేడీ విలన్ పాత్ర మెరుపులు ఉరుములతో ఆద్యంతం ఉత్కంఠ పెంచేస్తుందట. ఆ రోల్ కోసం వైకాపా నేత.. ఫైర్ బ్రాండ్ రోజాని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారుట. ఇటీవలే బోయపాటి రోజాని కలిసి రోల్ గురించి వివరించాడట. అయితే రోజా మాత్రం ఆలోచించి చెబుతానని సస్పెన్స్ లో ఉంచారని తెలుస్తోంది.

ఏపీలో వైకాపా అధికారంలోకి రావడానికి మహిళా నాయకురాలు రోజా ఎంతగానో శ్రమించారు. అందుకు ప్రతిగా తన హార్డ్ వర్క్ ని గుర్తించి పార్టీ ఏపీ ఐఐసీ చైర్మెన్ గా అవకాశం కల్పించింది. ఆ క్రమంలోనే పూర్తిగా రాజకీయాలతో బిజీ అవ్వడం తో సినిమాల కు దూరమయ్యారు రోజా. కేవలం బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి జడ్జిగా కొనసాగుతున్నారు. బాలయ్య- బోయపాటి ఆఫర్ కు రోజా ఎస్ చెబుతారా లేదా? అన్నది చూడాలి. బాలకృష్ణ సరసన రోజా గతం లో పలు విజయవంతమైన చిత్రాల్లో నాయికగా నటించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer