జబర్ధస్త్ నవ్వుల నాగబాబు కుర్చీ ఎవరిది?

0

గత ఏడేళ్లు గా తెలుగు తెర పై అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న షో `జబర్ధస్త్`. నాన్ స్టాప్ నవ్వుల నావగా అలరించిన ఈ రియాలిటీ షోకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ లో నిర్మాత శ్యామ్ ప్రసదరెడ్డి ఈ షోని డిజైన్ చేయించిన తీరు.. ఇందులో కామెడీ స్కిట్ లు చేస్తున్న కళాకారుల ప్రతిభ ఈ షోని శిఖరాగ్రాన నిలబెట్టింది. ఆరంభం వారానికి ఒక్క రోజు మాత్రమే ప్రసారం అయినా ఈ షోని పబ్లిక్ డిమాండ్ మేరకు వారానికి రెండు రోజులు ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఇంతటి పాపులర్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తప్పుకోవడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో కలకలం సృష్టించింది. ఉన్నట్టుండి నాగబాబు ఎందుకు ఈ షో నుంచి బయటికి వెళ్లిపోయారు. ఎందుకు ఇలాంటి షాక్ ఇచ్చారని చర్చ సాగింది. రెమ్యునరేషన్ కారణంగానే ఆయన బయటికి వెళ్లిపోయినట్టు సినీ వర్గాల్లో వినిపించింది. అయితే తాజాగా ఆయన స్థానం ఈయనదే అంటూ మరో పేరు తెర పైకి వచ్చింది.

ఆయనెవరో కాదు టాలీవుడ్ సీనియర్ రైటర్.. దర్శకనటుడు పోసాని కృష్ణమురళి. ఆయన స్థానంలో ఈయనను తీసుకురావడంలో రోజా మంత్రాంగం ఫలించిందట. రోజా సలహా మేరకే పోసానిని జబర్దస్త్ మేకర్స్ రంగంలోకి దించారని.. ఇక నుంచి నాగబాబు స్థానాన్ని ఆయనే భర్తీ చేస్తారని స్పష్టం చేసారు. అయితే నాగబాబు తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయాలని `మా` అధ్యక్షుడు నరేష్.. నిర్మాత బండ్ల గణేష్ లను పరిశీలించారట. ఇద్దరు సెట్టవరని తేలిపోవడంతో నాగబాబు స్థానాన్ని పోసాని కృష్ణమురళి మాత్రమే భర్తీ చేయగలరని చివరికి ఆయననే కన్ఫామ్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
Please Read Disclaimer