ఈసారి ప్రతి ఫ్రేమ్ లో రోజా కుమార్తె? ఎందుకిలా?

0

నటిగా సంచలనాల మీద సంచలనాలు క్రియేట్ చేసిన ఆర్కే రోజా.. రాజకీయ నాయకురాలిగా తన సత్తా చాటారు. ఆమె ఏం చేసినా మాత్రమే కాదు.. ఏం మాట్లాడినా వార్తగా మారుతుంది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఒక పక్క.. మరో వైపు జబర్దస్త్ లాంటి షోలతో అన్ని వర్గాల వారికి దగ్గరైన ఆమె.. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. తాను ప్రాతినిధ్యం వహించే నగరి (తిరుపతికి దగ్గర్లో ఉంటుంది) కి వెళ్లిపోతారు. పూర్తిగా అక్కడే ఉండి పోతారు.

సంక్రాంతి పండుగ హడావుడి అంతా రోజా మేడమ్ చుట్టునే తిరుగుతుందా? అన్నట్లుగా ఉంటుంది. ఎప్పటిలానే ఈసారి సంక్రాంతికి సైతం రోజా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. పండుగలో భాగంగా తాజాగా నగరి లో ఉంటున్న ఆమె.. ముగ్గులు వేయటం దగ్గర నుంచి.. ఎడ్ల బండి నడపటం వరకూ ఎక్కడా తగ్గట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే గా.. ఏపీఐఐసీ ఛైర్మన్ గా బిజీ గా ఉన్నప్పటికీ.. వాటిని పక్కన పెట్టేసిన కుటుంబం తో కలిసి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

ముగ్గులు వేయటం తో పాటు.. పిల్లలకు భోగిపళ్లు పోస్తున్న ఆమె.. రోటీన్ కు భిన్నం గా ఈసారి తన కుమార్తె అన్షూ మాలిక్ ను పక్కనే ఉంచుకుంటున్నారు. ఇప్పటివరకూ తన కుమార్తెను బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయకుండా ఉండి పోయిన ఆమె.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా తన పక్కనే ఆమెను ఉంచుకుంటూ ప్రతి ఫోటో ఫ్రేమ్ లోనూ ఆమె కనిపించేలా చేయటం విశేషం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. తన కుమార్తెను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రోజా భావిస్తున్నారని.. అందులో భాగంగానే ఆమె ఇలా చేస్తున్నారంటే.. మరికొందరు మాత్రం అలాంటి వాదనలు పూర్తిగా తొందర పాటే అంటున్నారు. ఏమైనా.. కుమార్తె కెరీర్ విషయంలో రోజా మేడమ్ కాస్త క్లారిటీ ఇచ్చే బాగుంటుందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-