యాక్షన్ లో రొమాన్స్

0

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన ‘యాక్షన్’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్.సీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అసలే విశాల్ యాక్షన్ హీరో.. టైటిల్ లోనే యాక్షన్ ఉంది ఇక చూసుకో నాసామి రంగ.. యాక్షన్ తో విశాల్ రెచ్చిపోతాడు. అది తప్ప మరేదీ ఉండదని కొందరు జనాలు ఫిక్స్ అయి ఉంటారు కానీ వారి అభిప్రాయం పూర్తిగా తప్పు. ‘యాక్షన్’ టీమ్ రిలీజ్ చేసిన కొత్త స్టిల్ చూస్తే ఆ విషయం తెలిసి పోతుంది.

ఈ పోస్టర్లో తమన్నా ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉంది. ఎంతసేపూ డిషుం డిషుంలేనా హీరోయిన్ సంగతి చూడవా అన్నట్టుగా ఉంది అమ్మడి వాలకం. రెడ్ కలర్ ఛోళి.. లెహెంగా ధరించి.. విశాల్ పై చెయ్యేసి మరి రొమాన్స్ చేస్తోంది. ఇక అందాల విందు కూడా పీక్స్ లోనే ఉంది. హీరోగారి వాలకం చూస్తుంటే ఆ కఠినమైన మనసు కాస్త కరిగి రొమాన్స్ మూడ్ లోకి వచ్చినట్టుగా ఉన్నాడు. క్రూ కట్ హెయిర్ స్టైల్ తో.. బ్లూ కలర్ డ్రెస్..పైన ఒక స్టోల్ లాంటిది వేసుకొని సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు విశాల్. ఈ స్టిల్ చూస్తుంటే ఏదో పాట లో భాగం అయి ఉంటుందనిపిస్తోంది.

ఈ సినిమా లో విశాల్ తో పాటుగా తమన్నా కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సు లలో పాలు పంచుకుందని సమాచారం. ఈమధ్య ‘సైరా’ లో తమన్నా నటన కు భారీ ప్రశంసలు దక్కాయి. మరి ఈ ‘యాక్షన్’ తో ప్రేక్షకుల ను మెప్పిస్తుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer