రొమాంటిక్ మాస్ హీరో ఏజ్ తెలిసిపోతోందట

0

ఆయన చిటికేస్తే మాస్. ఆయన నడిచొస్తే మాస్. ఒంటి చేత్తో వందమంది గాల్లో లేవాలి. స్టీమింజన్ సైతం భయపడి వెనకడుగేయాలి. ఇక ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు తన చుట్టూ లేకపోతే ఆ ఫ్రేమ్ ని ఊహించు కోవడమే చాలా కష్టం. అయితే ఆ హీరో ఎంత ఏజ్ బార్ అవుతున్నా.. ఇంకా రొమాంటిక్ వేషాలు వేయడం.. ఏజ్ తో పని లేకుండా విలన్లను చితక్కొట్టేయడం పైనే ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒంటి చేత్తో వందమందిని గాల్లోకి లేపే సీన్ల లో అయితే చెయ్యి లేవలేని పరిస్థితి. ఒళ్లు సరిగా సహకరించడం లేదట. గట్టిగా చెయ్యెత్తితే అటూ ఇటూ ఊగిపోయే పరిస్థితి ఎదురవుతోంది. పైగా కళ్ల కింద వలయాల్లో క్యారీ బ్యాగులు కూడా ఓపెన్ అయి పోతుండడంతో ఇక ఏజ్ క్లియర్ కట్ గా తెలిసిపోతోందన్న గుసగుస వేడెక్కిస్తోంది. ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడరు. ముందు నుంచి మాట్లాడని సుందరాంగులు వెనక నుంచి లీకులిస్తుండడం తో ఈ యవ్వారం కాస్తా హీటెక్కించేస్తోంది.

హాలీవుడ్ హీరోల తరహాలో మన మాసివ్ మాస్ సీనియర్ హీరోలు కూడా ఆ రేంజులోనే ఫైట్లు చేసేస్తుండడం చూస్తుంటే ఔరా! అని ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఇక వీళ్లను చూపించే దర్శకుల్లో భజంత్రీ బ్యాచ్ ఎక్కువ కావడంతో ఆ తరహా కమర్షియల్ అంశాల కోసం ఇలాంటి కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారట. అయితే ఎంత ప్రయత్నించినా ఆన్ లొకేషన్ చూసిన వాళ్లు లీకులివ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో ఫోటోలు లీక్ చేస్తూ ఇలాంటి డిస్కషన్లు చేస్తుండడం తో ఎవరబ్బా ఈ క్యారీబ్యాగుల మాస్ హీరో అన్న చర్చా వేడెక్కించేస్తోంది. శ్రీనువైట్ల ఫామ్ లో ఉండి ఉంటే మరోసారి క్యారీ బ్యాగుల హీరోలపై పంచ్ లు వేసేవాడేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు మరి.
Please Read Disclaimer