రౌడీ సొంతిల్లు.. సైలెంటు గా గృహ ప్రవేశం!

0

ప్రతిభ.. అదృష్టం ఒకే ఒర లో ఇమిడితే సక్సెస్ ఎలా పరిగెత్తుకొస్తుందో విజయ్ దేవరకొండ ను చూసి చెప్పొచ్చు. `పెళ్లి చూపులు`తో సోలో హీరోగా మొదలైన పయనం కేవలం నాలుగైదేళ్లలోనే టేకాఫ్ అయిన తీరు ఆసక్తికరం. `అర్జున్ రెడ్డి- గీత గోవిందం- టాక్సీవాలా` చిత్రాల తో బ్లాక్ బస్టర్ జర్నీగా మారింది. ఓ వైపు హీరోగా కెరీర్ బిజీ.. మరో వైపు సొంత బ్యానర్ కింగ్ ఆఫ్ ది హిల్ అభివృద్ధి ప్రణాళిక.. అన్నీ జెట్ స్పీడ్ తో సాగి పోతున్నాయి.

త్వరలోనే ఓ ఇంటివాడు అయ్యే తరుణం దగ్గర పడుతోందట. ఈలోగానే రౌడీ తనకంటూ ఓ సొంత ఇంటిని రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఎమ్మెల్యే కాలనీ పరిసరాల్లో దేవరకొండ ఇల్లు ఉండేది. ఇప్పుడు ఫిలింనగర్ లోని శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ నివశించే ఇంటికి పక్కనే సొంతంగా ఓ ఇల్లు కొనుక్కున్నాడని తెలుస్తోంది. ఈ ఏరియా పోష్ గా ఉంటుంది. అక్కడ డీసెంట్ గా ఉండే కొత్త ఇంటిని రౌడీ కొనుక్కున్నాడట. దీనికోసం భారీగానే పెట్టుబడి పెట్టాడని తెలుస్తోంది. ఇటీవలే తన తల్లిదండ్రులు – సోదరి సహా ఆ ఇంట్లోకి ఎలాంటి హడావుడి లేకుండా సైలెంటుగా గృహప్రవేశం చేశారట.

రౌడీ సొంతిల్లు రెడీ అయ్యింది సరే… ఇంతకీ పెళ్లెప్పుడు? అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే తనకు ఇంటి పోరు ఎక్కువగానే ఉంది. పెళ్లాడాల్సిందిగా ఒత్తిడి ఉందట. అయితే పెళ్లి కి ముందే ఇలా సొంత ఇల్లు రెడీ చేశాడు. ఇక లైఫ్ లో సెటిల్ మెంట్ ఉంటుందన్న ముచ్చటా ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం దేవరకొండ కన్ఫ్యూజన్ స్టాటస్ ని వీడి ఇంట్లో వాళ్లు చూసే అమ్మాయినే పెళ్లాడే ఛాన్సుందని ఫ్యాన్స్ లో గుసగుస వినిపిస్తోంది.
Please Read Disclaimer