రౌడీ మర్చిపోయిన రౌడీస్ మాత్రం మర్చిపోలేదే

0

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా రూపొందిన మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయమై ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ తాను నటించిన సినిమాలను ఎలా అయితే జనాల్లోకి చొచ్చుకు పోయేలా ప్రమోట్ చేస్తాడో తాను నిర్మించిన సినిమాకు కూడా అంతకు మించి విభిన్నమైన తీరులో ప్రమోట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ నటించడంను రౌడీ స్టార్ ఫ్యాన్స్ రౌడీస్ జీర్ణించుకోలేక పోతున్నారు.

విజయ్ ఎక్కడ స్టేజ్ ఎక్కినా.. జనాల ముందుకు వచ్చినా కూడా ఇందులో అనసూయకు ఎందుకు ఛాన్స్ ఇచ్చారంటూ ఆందోళన చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలోని ఒక బూతు మాటను ప్రీ రిలీజ్ వేడుక సమయంలో స్టేజ్ పై విజయ్ దేవరకొండ అనడంను చాలా మంది తప్పుబట్టారు. అందులో ముఖ్యంగా అనసూయ కూడా ఉంది. ఒక బాధ్యతగల హీరో వేలాది ముందు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటీ అంటూ సోషల్ మీడియా ద్వారా రౌడీ స్టార్ పై అసహనం వ్యక్తం చేసింది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనసూయను టార్గెట్ చేసిన విషయం తెల్సిందే.

అప్పటి నుండి కూడా రౌడీస్ కు అనసూయ అంటే అంతగా గిట్టడం లేదు. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా కూడా ట్రోల్స్ చేయడం చేస్తున్నారట. ఇక విజయ్ దేవరకొండ నిర్మాణంలో వచ్చిన సినిమాలో అనసూయ ఉండటంను జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయమై ఇటీవల విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు క్షమించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిని నేను అస్సలు పట్టించుకోను. నేను అనసూయను క్షమించేశాను అన్నాడు.

మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటీనటుల ఎంపిక విషయం నాకు సంబంధించింది కాదు. దర్శకుడు ఆ పాత్రకు అనసూయను తీసుకుంటానంటే నేను సరే అన్నాను. దర్శకుడి నిర్ణయం మేరకు ఆమె ఎంపిక జరిగింది. ఒకవేళ నేను దర్శకత్వం వహిస్తే ఆమెను తీసుకుంటానా లేదా అనేది చెప్పలేను. ఈ సినిమాలో ఆమె మంచి నటనతో మెప్పించింది. ఆమెకు ఇంకా మంచి సక్సెస్ లు రావాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. రౌడీ విజయ్ దేవరకొండ ఆ విషయాన్ని మర్చిపోయినా రౌడీస్ మాత్రం మర్చి పోవడం లేదు.
Please Read Disclaimer