రౌడీ ఏంటీ అతి ?

0

‘పెళ్లి చూపులు’ తో హీరోగా పరిచయమైన విజయ్ అక్కడి నుండి వెనక్కి చూసుకోకుండా స్టార్డంతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.. మధ్యలో రౌడీ అనే బ్రాండ్ వేసుకొని తన ఫ్యాన్స్ కి కూడా అదే టైటిల్ ఇచ్చి ముద్దుగా పిలిచుకుంటున్నాడు. రౌడీ పేరుతో విజయ్ చేసే పనులు కూడా ఆడియన్స్ ను థ్రిల్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అక్కడి వరకూ బాగానే ఉంది.

కానీ ఈ మధ్య రౌడీ పేరు తో విజయ్ చేస్తున్న పనులే ప్రేక్షకులకు అతి అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఈవెంట్స్ కి విజయ్ వేసుకొస్తున్న బట్టలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. మొన్నటి వరకూ ఏదో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో వచ్చిన విజయ్ లేటెస్ట్ గా వైజాగ్ లో జరిగిన ఈవెంట్ కి ఓ లుంగీ కట్టుకొని ఓ నార్మల్ షర్ట్ వేసుకొని తలకు టవల్ చుట్టుకొచ్చాడు.

దీంతో రౌడీను అలాంటి కాస్ట్యూమ్ తో చూసి విశాఖ జనాలు షాక్ అయ్యారు. కొందరు తమలో ఒకడిగా లుంగీ కట్టుకొని వచ్చిన తీరు బాగుందని అన్నప్పటికీ సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత ఉంది. ఆ డ్రెస్ లో విజయ్ ఫొటోస్ తో ఎప్పటి లాగే ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. కొందరైతే నెక్స్ట్ ఈ డ్రెస్ లో వస్తాడేమో అంటూ సినిమాల్లో కమెడియన్స్ వేసుకున్న అమ్మాయిల డ్రెస్ ఫోటోలతో మీమ్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా స్టార్డం ఉన్న హీరో ఏం చేసినా ఇలాగే ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ఇలాంటి వాటికి దూరంగా ఉండి హీరో హోదాలోనే వస్తూ ప్రేక్షకులతో మాట్లాడుతుంటారు.
Please Read Disclaimer