రెబల్ కే బాప్ లా రౌడీ మేకోవర్ అదిరిందిగా

0

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఏం చేసినా సెన్సేషనే. వరుస క్రేజీ చిత్రాలతో ఊహించని స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తన క్రేజ్ నే బ్రాండ్ గా మార్చుకుని రౌడీ బ్రాండ్ అంటూ క్లాతింగ్ బ్రాండ్ ని లాంచ్ చేసి సంచలనం సృష్టించాడు విజయ్ దేవరకొండ. ఇటీవల నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

తాజాగా `వాట్స్ అండ్ వోల్ట్స్ ` కంపెనీలో భాగస్వామిగా చేరిన విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్ కి శ్రీకారం చుట్టాడు. బ్యాటరీ వాహనాల తయారీలో తనదైన ముద్ర కోసం ముందడుగు వేస్తున్నాడు. ఇందు కోసం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ వైట్ కలర్ షేర్వానీ …దానిపై బ్లాక్ కలర్ జాకెట్ తో లాంగ్ హెయిర్ తో డాపర్ లుక్ లో డ్యాషింగ్ గా కనిపిస్తున్నాడు. ఒక రకంగా గిరజాల జుత్తుతో రెబల్ కే బాప్ లా కనిపిస్తున్నాడు మరి.

స్టైల్స్ అనగానే టాలీవుడ్ లో ముందుగా గుర్తొచ్చే హీరో అల్లు అర్జున్ .. అతన్ని ఢీకొట్టే రేంజ్ లో విజయ్ తన స్టైల్స్ తో యాటిట్యూడ్ తో దూసుకుపోతున్నాడు. వైట్ కలర్ షేర్వానీ …దానిపై బ్లాక్ కలర్ జాకెట్ తో లాంగ్ హెయిర్ లో విజయ్ కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్టు కియరాతో కలిసి మెబాజ్ కోసం అదిరిపోయే యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. అలాగే ఫైటర్ కోసం 6 ప్యాక్ లుక్ తోనూ రెబలిజం చూపిస్తున్నాడు. మరోవైపు క్రేజీ కార్పొరెట్ కంపెనీలతో టై అప్ లు పెట్టుకుని ఇలా చెలరేగిపోతున్న విజయ్ క్రమక్రమంగా నైజాం మెగాస్టార్ గా తనదైన ముద్ర వేయడం ఖాయంగానే కనిపిస్తోంది మరి.