పరుగులు పెట్టిస్తున్న జక్కన్న.. అందుకేనా?

0

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ కోసం దేశవ్యాప్తంగా సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘RRR’ షూటింగ్ పగలూ రాత్రీ తేడాలేకుండా కొనసాగుతోందట. వచ్చే ఏడాది జులై 30 వ తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ముందే డేట్ ప్రకటించారు కాబట్టి జక్కన్న & టీమ్ షూటింగును పరుగులు పెట్టిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్నరాత్రి జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్నారట. రాత్రి సమయంలో జరిగే కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే చరణ్ కు సంబంధించిన సన్నివేశాలను కోకాపేట్ లోని సెట్ లో పగలు షూట్ చేస్తున్నారట. వారం తర్వాత ఇద్దరూ కలిసి ఉండే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.

అయితే సడెన్ ఇలా షూటింగ్ లో స్పీడు పెంచేసరికి రిలీజ్ డేట్ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో ఇలా స్పీడ్ పెంచి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పలు కారణాల వల్ల ‘RRR’ లో డిలే కావడంతో వచ్చే ఏడాది రిలీజ్ డేట్ ను అందుకోలేరని ప్రచారం సాగింది. ఈ స్పీడ్ చూస్తుంటే అనుకున్న సమయానికే RRR వచ్చేలా ఉంది. అయితే స్పీడుగా పూర్తిచేయాలనే హడావుడిలో క్వాలిటీ దెబ్బతినకుండా చూసుకోవాలని జక్కన్న అభిమానులు కోరుతున్నారు.
Please Read Disclaimer