RRR: ఇద్దరు హీరోల పై భారీ సాంగ్?

0

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘RRR’ షూటింగ్ ప్రస్తుతం జోరు గా సాగుతోంది. ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ నటిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కమర్షియల్ సినిమా తరహా లో రెగ్యులర్ పాటలు పెట్టే అవకాశం లేదు. అందుకే ఈ సినిమా థీమ్ కు తగ్గట్టు మాత్రం పాటలు ఉంటాయట.

ఈ విషయం గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా లో చరణ్.. ఎన్టీఆర్ పై రాజమౌళి పాటను ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట జానపదం అని సమాచారం. చరణ్.. ఎన్టీఆర్ ఇద్దరూ బ్రిలియంట్ డ్యాన్సర్స్ కాబట్టి రాజమౌళి ఇద్దరి పై సూపర్ డ్యాన్సులు ఉండేలా పాట ప్లాన్ చేస్తారని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక సెట్ నిర్మాణం జరుగుతోందట. త్వరలోనే ఈ సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతుందట. ఇదిలా ఉంటే ప్రస్తుతం RRR షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోందని చరణ్ పై బ్రిటిష్ జడ్జిలు ఉండే కోర్టు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.

ఈ సినిమా లో అలియా భట్.. అజయ్ దేవగణ్.. రాహుల్ రామకృష్ణ.. రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దేశ వ్యాప్తం గా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Please Read Disclaimer