#RRR కొమరం భీమ్ లుక్ లాంచ్ లేనట్టే!

0

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ కథే వేరు. కానీ ఆర్.ఆర్.ఆర్ విషయంలో ఏదీ అనుకున్నట్టుగా జరగకపోవడం ఒత్తిడిని పెంచుతోంది. ముఖ్యంగా జక్కన్న అండ్ కోకి కరోనా బిగ్ ఛాలెంజ్ గా మారింది. పాన్ ఇండియా రేంజ్ సినిమాని పరిమితుల నడుమ చిత్రీకరించాలంటే సులువైన పనా? ఒక సాధారణ సన్నివేశానికే బ్యాక్ గ్రౌండ్ లో వందలాది మంది ఆర్టిస్టుల్ని ఉపయోగించి రాజమౌళి .. భారీ యాక్షన్ సీన్స్ కి ఏ రేంజు ప్లానింగుతో ఉంటాడో తెలిసినదే. ఇక విజువల్ గ్రాఫిక్స్ కి అనుకూలంగా ఉండేలా ప్రతిదీ కుదరాలి.కానీ అన్నిటికీ మహమ్మారీ జక్కన్న ప్లాన్స్ కి చెక్ పెట్టేసింది. కారణం ఏదైనా ఈపాటికే రిలీజ్ కావాల్సిన కొమరం భీమ్ లుక్ లాంచ్ వాయిదా పడింది. పదే పదే వాయిదా వేయాల్సిన సన్నివేశంలోనే ఉన్నారు జక్కన్న టీమ్. ఇలాంటి రకరకాల కారణాలతోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించిన ట్రీట్ దక్కడం లేదు. కనీసం ఇప్పుడు షూటింగులు తిరిగి ప్రారంభించాక అయినా త్వరగా కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేస్తారని ఆశిస్తే అది కూడా ఇప్పట్లో సాధ్యపడేట్టు కనిపించడం లేదుట.తొలి నుంచి తారక్ లుక్ ని లాంచ్ చేయాలంటే ఎంతో ఆచితూచి అడుగులేస్తున్న జక్కన్న లాక్ డౌన్ ముందే ఒక వీడియో టీజర్ ని లాంచ్ చేయాలని భావించారు. కానీ అది సాధ్యపడలేదు. తారక్ బర్త్ డే ట్రీట్ అలా మిస్సయ్యింది. ఇప్పుడు వెంటనే షూట్ ప్రారంభించి కొమరం భీమ్ పై ఫుటేజ్ రెడీ చేయాలన్నా కష్టంగానే ఉంది.

ఇప్పుడే ఆంక్షల నడుమ షూట్ ప్రారంభించాలా వద్దా? అన్న డైలమాలో ఉన్నారట రాజమౌళి. కాస్త వేచి చూసే ధోరణితోనే ఉన్నారట. పరిమిత సిబ్బందితో ఆంక్షల మధ్య ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ ప్రాజెక్ట్ షూటింగ్ నిర్వహించడం కష్టం అని రాజమౌళి భావిస్తున్నారట. షూటింగ్ కోసం సెట్ సిద్ధంగా ఉన్నా మొదలుపెట్టడానికి ఎందుకో సంశయిస్తున్నారు. కాస్త ఆగి నిర్ణయం తీసుకోనున్నారట. దీంతో ఇప్పట్లో కొమరం భీమ్ టీజర్- ట్రైలర్ ట్రీట్ లేనట్టేనని భావిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశను మిగిల్చేదే.




Please Read Disclaimer