దానయ్య చేతికి RRR అడ్వాన్స్?

0

సినిమా ఆన్ సెట్స్ ఉండగానే చేతిలో అడ్వాన్స్ పడితే ఆ కిక్కే వేరు. ఏ నిర్మాతకు అయినా అదో అఛీవ్ మెంట్ అనే చెప్పాలి. ఇటీవల భారీ చిత్రాల నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ బాగానే గుంజుతున్నారు. ఆ కోవలోనే మోస్ట్ అవైటెడ్ RRR సినిమాకి సంబంధించి తొలి పెద్ద అడ్వాన్స్ దానయ్య చేతిలో పడనుందట. ఆ మేరకు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆర్.ఆర్.ఆర్ ఓవర్సీస్ (అన్ని భాషలు) హక్కుల్ని దుబాయ్ కి చెందిన ప్రఖ్యాత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఫార్స్ ఫిలిమ్స్ చేజిక్కించుకుందని ఇదివరకూ వార్తలొచ్చాయి. ఈ హక్కుల కోసం ఏకంగా 65 కోట్ల మేర డీవీవీ సంస్థతో డీల్ కుదిరిందని ప్రచారమైంది. ఇందులో సగం పేమెంట్ .. అంటే 30 కోట్ల మేర అడ్వాన్స్ రూపంలో ఈ వారంలోనే దానయ్యకు అందేస్తోందట. అంత పెద్ద మొత్తాన్ని సింగిల్ పేమెంట్ లోనే అందేసుకుంటున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో వైపు ఫార్స్ సంస్థ `సాహో` లాంటి భారీ చిత్రాన్ని ఓవర్సీస్ లో రిలీజ్ చేయనుంది. అందుకోసం భారీ మొత్తానికి యూ.వి.క్రియేషన్స్ తో డీల్ కుదిరింది. సాహో ఆగస్టు 15న రిలీజవుతోంది. ఆర్.ఆర్.ఆర్ 2020 జూలై 30న రిలీజ్ కానుంది. ఇంకా చాలా సమయం ఉన్నా అప్పుడే దానయ్యకు అడ్వాన్స్ అందేస్తుండడంపై చర్చ సాగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పరిశ్రమలో ఆ నోటా ఈనోటా గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.. తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఆలియాభట్ .. అజయ్ దేవగన్ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి క్షణం తీరిక లేకుండా ఓ యజ్ఞంలా భావించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Please Read Disclaimer