‘ఆర్ ఆర్ ఆర్’ తదుపరి షెడ్యూల్ అప్ డేట్స్

0

ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణ కొనసాగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెల్సిందే. హైదరాబాద్ తో పాటు ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన జక్కన్న త్వరలో సౌత్ ఆఫ్రికా వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.

సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్ లో ఇతర నటీనటులు కూడా పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ టీం సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లలో మునిగి పోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ లొకేషన్స్ ఎంపిక కూడా జరిగిందట. దాదాపు మూడు వారాల పాటు ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ అక్కడ జరుపబోతున్నారు.

తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానయ్య ఈ చిత్రంను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో రాజమౌళి ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ ‘సైరా’ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా ఎన్టీఆర్ పై సీన్స్ ను జక్కన్న తెరకెక్కించారు. త్వరలో ఇద్దరు కలిసి మళ్లీ షూట్ లో జాయిన్ కాబోతున్నారు.
Please Read Disclaimer