#RRR వీరుడి రొమాన్స్ వీర లెవల్లో

0

RRR లో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఏదైనా ఉందా? అంటే ఉందనే లీక్ అందింది. ఇప్పటికే సినిమాలో ఏడెనిమిది పాటలుంటాయన్న ప్రచారం ఉంది. అలాగే చెర్రీ-అలియా మధ్య రొమాంటిక్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారుట. చెర్రీ-అలియా కలిసి ఈ పాట కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారని సమాచారం.

ఆసక్తికరంగా.. ఈ పాటలోనూ ఫిక్షన్ పీక్స్ లో ఉంటుందట. దీనిని గ్రాఫికల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు జక్కన్న ప్లాన్ చేశారట. ఇక అందాల సీతగా కనిపించే ఆలియాని అల్లూరి సీతా రామరాజు (చరణ్) బైక్ రైడ్ కి కూడా తీసుకెళ్లే షాట్స్ ని ఈ పాటలో చూపిస్తున్నారట. మరి ఇందులో వాస్తవమెంత? అన్నది యూనిట్ స్పందిస్తే గాని తెలియదు. అయితే అల్లూరి కాలంలో బైక్ లు ఉన్నాయి. ఆంగ్లేయులు వాటిపై రైడ్ చేశారు. మరి ఆలియాతో ఎలాంటి బైక్ పై చరణ్ రైడ్ చేస్తాడు? అన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది.

ఇక తారక్- ఒలీవియా జంట రొమాన్స్ ని జక్కన్న ఏ స్థాయిలో ఎలివేట్ చేయనున్నాడు? అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలే ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఓలీవియా మోరిస్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనుండగా ఒలీవియా జెన్నిఫర్ అనే ఆంగ్ల యువతిగా నటించనుంది. కొమురం భీమ్ ని ప్రేమించే విదేశీ యువతిగా ఒలీవియా హొయలు మైమరిపిస్తాయట. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కు హీరోయిన్ ని ఫైనల్ చేసిన నేపథ్యంలో తదుపరి ఆ ఇద్దరిపైనే సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఏకంగా 10 భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకరకంగా టాలీవుడ్ హిస్టరీలోనే ఇలాంటి ప్రయత్నం వేరొకటి లేదనే చెప్పాలి.




Please Read Disclaimer