ఆ డేట్లు రావాలంటే RRR డేట్ తేలాలట!

0

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఏడాది జులై 30 న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ కు రిలీజయ్యే అవకాశం ఉందని కొందరు అంటుంటే మరికొందరేమో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ను బట్టి కొన్ని ఇతర సినిమాల విడుదల తేదీలు ఫిక్స్ అవుతాయి. ‘RRR’ రిలీజ్ మార్పును బట్టి ఇతర స్టార్ హీరోలు తమ సినిమాల తేదీలను మార్చుకోవలసి ఉంటుంది.

ఈ సినిమాతో డైరెక్ట్ గా ముడిపడి ఉండేది మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా. ఈ మూవీలో చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘RRR’ రిలీజ్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని ఇప్పటికే చరణ్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను బట్టి చిరంజీవి సినిమా డేట్ ఫిక్స్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాను ఈ దసరా సమయానికి రెడీ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ కూడా ‘RRR’ పైనే ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ – క్రిష్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఒకవేళ ‘RRR’ కనుక సంక్రాంతికి రిలీజ్ అయ్యే పక్షంలో ఈ సినిమా డేట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది.

ఈ సినిమాలే కాదు.. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి సినిమాను నెక్స్ట్ సంక్రాంతి బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నారట. ‘RRR’ సంక్రాంతికి వస్తుందంటే తప్పనిసరిగా డేట్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇక ప్రభాస్ ‘జాన్’ సినిమాను ఈ అక్టోబర్ లో అనుకుంటున్నారట. ‘RRR’ డేట్ ను బట్టి ఈ సినిమా విడుదల తేదీ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ టాప్ స్టార్ హీరోల సినిమాలు. ఈ మార్పులను బట్టి మీడియం రేంజ్ హీరోల సినిమాల రిలీజ్ తేదీలు మారాల్సి ఉంటుంది. అందుకే ‘RRR’ సంగతి క్లారిటీగా చెప్పేస్తే మేలని.. ఇతర ఫిలిం మేకర్లకు ఇబ్బంది ఉండదని అంటున్నారు.
Please Read Disclaimer