RRR టీమ్ కేరాఫ్ వికారాబాద్ ఫారెస్ట్

0

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం భారీ బడ్జెట్ తో ‘RRR’ సినిమాను రూపొందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ డెడ్లైన్ అందుకునేందుకు ‘RRR’ టీమ్ శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ‘RRR’ షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోందట. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్ మరో వారం రోజుల పాటు జరుగుతుందట. ఇవి చరణ్ కు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే కావడంతో ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనడం లేదట. ఈ షెడ్యూల్ తో దాదాపుగా 80% షూటింగ్ పార్ట్ పూర్తయినట్టేనని అంటున్నారు. మార్చి నెలాఖరుకల్లా మొత్తం షూటింగ్ పూర్తిచేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఆ తర్వాత కంప్లీట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెడతారట. షూటింగ్ పూర్తయిన తర్వాతే ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అందుకే ఇప్పుడు ‘RRR’ కు సంబంధించిన విశేషాలు పెద్దగా వెల్లడించడం లేదని అంటున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘RRR’ ముందుగా ప్రకటించినట్టుగా జులై 30 వ తారీఖున రిలీజ్ అవుతుందని.. వాయిదా ఉండదని అంటున్నారు.
Please Read Disclaimer