కొమరం భీమ్ లుక్.. తారక్ ఫ్యాన్స్ టెన్షన్

0

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వకూడదని జక్కన్న చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఫ్యాన్స్ ఏదో రకంగా కూపీ లాగేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ స్టోరీలైన్ ని రాజమౌళినే దాచకుండా చెప్పేశారు. ఆంగ్లేయుల కాలంలో తెలంగాణ విప్లవయోధుడు కొమురం భీమ్.. ఆంధ్రా విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కలిస్తే.. ఈ కథలో ఫిక్షన్ ఏమిటన్నదే సినిమా లైన్. చరణ్ అల్లూరి అయితే.. తారక్ కొమరం భీమ్ అని కన్ఫామ్ చేశారు. అయితే అధికారికంగా ఇంతవరకూ చరణ్ లుక్ కానీ.. తారక్ లుక్ కానీ రివీల్ చేయనేలేదు. చరణ్ బర్త్ డే.. ఎన్టీఆర్ బర్త్ డే.. వచ్చి వెళ్లాయి. కానీ ఏ లుక్ ని రిలీజ్ చేయలేదు. మొన్న దసరా సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుంచి ఏదైనా అప్ డేట్ తెలుస్తుందని ఆశించి భంగపడ్డారు. ఆర్.ఆర్.ఆర్ అధికారిక ప్రెస్ మీట్ లో చూపించిన పోస్టర్ తప్ప ఇంతవరకూ అస్సలు వేరొక పోస్టర్ అన్నదే రిలీజ్ కాలేదు.

అయితే .. నేడు (అక్టోబర్ 22న) విప్లవ వీరుడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా RRR టీం ఆయనకి నివాళులర్పిస్తూ ఒక ట్వీట్ చేసింది. “కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఆయనకు మా సంస్మరణం. యంగ్ భీమ్ గా ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు? అన్నది పెద్ద తెరపై ప్రేక్షకులకు చూపించడానికి మేం చాలా ఎగ్జయిటెడ్ గా ఉన్నాం..“ అని ఈ ట్వీట్లో పేర్కొన్నారు.

ట్వీట్ అయితే వచ్చింది కానీ పోస్టర్ లుక్ రాలేదు. దీంతో అభిమానుల్లో ఒకటే టెన్షన్ అలుముకుంది. కొందరు ఫ్యాన్స్ ఈ టెన్షన్ తట్టుకోలేక రాజమౌళి అండ్ టీమ్ ని ఇష్టానుసారం తిట్టేశారు. `పోస్టర్ లేకుండా బాగానే ఏసేశాడు!` అంటూ ఓ అభిమాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెరపైనే చూపిస్తారా.. కనీసం పోస్టర్ అయినా చూపించరా? అని కొందరు అభిమానులు కలతకు గురయ్యారు. అహా.. వాళ్లు ఇవ్వకపోతే మనమే ఎడిట్ చేసుకోవడమే.. అంటూ ఓ ఫ్యాన్ ఏకంగా పోస్టర్ నే క్రియేట్ చేసేశాడు. ఇలా ట్వీట్లు వేసే ముందు మమ్మల్ని చంపెయ్ రా చంపెయ్! అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు వేరొక ఫ్యాన్. మొత్తానికి రాజమౌళి-దానయ్య టీమ్ పై తారక్ ఫ్యాన్స్ కోపం తారా స్థాయికి చేరుకుందని రీట్వీట్లను బట్టి అర్థమవుతోంది.
Please Read Disclaimer