ట్విట్టర్ లో RRR ట్రెండ్ అయిందే!

0

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల్లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు తీస్తే ‘RRR’ అగ్రభాగాన నిలుస్తుంది. రాజమౌళి సినిమా కావడంతో ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగువారికి ఈ చిత్రం మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఇద్దరు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు.

దీంతో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఈ సినిమా విడుదల కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30 వ తేదీన విడుదల చేస్తామని ‘RRR’ టీమ్ చాలా నెలల క్రితమే ప్రకటించింది. మధ్యలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయిందని.. విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి కానీ అదేమీ లేదని చరణ్ కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. ఇక ‘RRR’ యూనిట్ కూడా ఈమధ్య సినిమా షూటింగ్ 70% పూర్తయిందని వెల్లడించారు. ఈ లెక్కన ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం పక్కా అని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 250 రోజుల సమయం ఉంది. దీంతో చరణ్.. ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో #250DaysToMassiveRRR అంటూ ఒక హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

సహజంగా 100 రోజులలో విడుదల ఉందనగా.. 50 రోజులలో విడుదల ఉందనగా ఇలాంటి హ్యాష్ టాగ్స్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తారు. ఈ సినిమాకు అలానే 250 రోజుల కౌంట్ డౌన్ ను సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం. ఇలా ట్రెండ్ చేసేందుకు అభిమానులు దాదాపుగా 80 వేల ట్వీట్స్ చేయడం గమనార్హం. దీన్ని బట్టి అభిమానుల్లో ఈ సినిమా పట్ల ఎంత ఉత్సాహం ఉందో తెలుస్తుంది. ఇక ఈ సినిమా టీజర్.. ట్రైలర్లు రిలీజ్ అయితే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమే.
Please Read Disclaimer