రియల్ స్టోరీతో RT66 కాంబో

0

మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటించనున్న చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసింద. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. RT66 అనే వర్కింగ్ టైటిల్ తో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో రవితేజ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే ఇది రీమేక్ సినిమానా? దర్శకుడి సొంత స్క్రిప్టునా? అన్న దానిపై సరైన క్లారిటీ మిస్సయ్యింది. అయితే ఇది అట్లీ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ `తేరీ`కి రీమేక్ అంటూ ప్రచారం సాగుతోంది. అందులో హీరో విజయ్ కూడా పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆ సందేహం బలపడుతోంది.

షల్ మీడియాలోనూ తేరి రీమేక్ అంటూ వైరట్ గా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత? అంటే.. వాటన్నిటిపైనా తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని క్లారిటీ ఇచ్చాడు. ఇది తేరీ రీమేక్ కాదని.. వాస్తవ సంఘటనలు ఆధారంగా రాసుకుని తీస్తోన్న సినిమా అని వెల్లడించాడు. దీంతో ఈ క్లారిఫికేషన్ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రవితేజ సినిమాలన్నీ ఇప్పటి వరకూ కల్పిత కథలతోనే తెరకెక్కాయి. తొలిసారి వాస్తవ సంఘటనలు ఆధారంగా సినిమా చేస్తున్నాడు. అటు గోపీచంద్ మలినేని చేసిన సినిమాలన్నీ కూడా ఇదే తరహావి.

గతంలో డాన్ శీను.. బలుపు ఈ కాంబినేషన్ లో వచ్చినవే. ఆ రెండు సినిమాలు ఫన్ బేస్ చేసుకుని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రాలు. ఈ నేపథ్యంలో ఆ కాంబోలో అంతకు మించి కొత్తదనం ఏం ఉంటుందో అన్న డైలమా రాజా అభిమానుల్లో నెలకొంది. కానీ ఇంతలోనే ఈ సర్ ప్రైజ్ ప్రకటన ఆసక్తిని పెంచుతోంది. ఈసారి ఈ జోడీ పూర్తిగా మారారు. మారిన ట్రెండ్ లోనే వెళుతున్నారు. అందుకు తగ్గ కథనే ఎంచుకున్నారు. స్క్రీన్ ప్లే విషయంలోనూ భిన్నంగానే వెళ్తున్నారట. నిజఘటనల ఆధారంగా రాసుకున్న వాస్తవ కథకు గోపీ తనదైన శైలిలో కమర్శియాలిటీనీ అద్దుతాడా? లేక ఆడియన్స్ కి రియలిస్టిక్ పంథాలో కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తాడా? అన్నది చూడాలి. ఇందులో సముద్ర ఖని ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రవితేజ కు జంటగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఫేవరెట్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
Please Read Disclaimer