రఫ్ఫాడించిన రెజీనా

0

రెజినా కసాండ్రా తెలుగు ప్రేక్షకులలో మంచి పాపులారిటీ ఉన్న భామే. రెజీనా ఖాతాలో హిట్స్ కూడా ఉన్నాయి.. అయితే ఎందుకో స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఈమధ్య ‘ఎవరు’ సినిమాతో ఓ మంచి హట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా వివా లమోర్ మ్యాగజైన్ అక్టోబర్ ఎడిషన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఆ మ్యాగజైన్లో రెజీనాపై ఒక కథనం కూడా ప్రచురించారు.

ఈ విషయాన్ని తెలుపుతూ వివా లమోర్ అధికారిక ఇన్స్టా ఖాతా ద్వారా కవర్ పేజి ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు “రెజీనా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తన సెలెక్షన్ తో ప్రయోగాలు చేశారు. ఆమె సరదాగా ఉంటారు. విభిన్నమైన వ్యక్తి.. శ్రమను నమ్ముతారు. మా అక్టోబర్ ఎడిషన్ లో రెజినా కసాండ్రా ఎంత గ్రేస్ ఫుల్ గా ఉన్నారో చూడండి” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో రెజీనా నిలువు చారలు ఉండే బ్లాక్ టాప్- ప్యాంట్.. ఖాకీ తరహాలో ఉండే ఒక కోటు ధరించింది. ఒక పక్కకు దువ్విన జుట్టు.. వెడల్పుగా ఉన్న కమ్మలు ధరించి వెరైటీగా కూర్చుని పల్లెటూరి అమ్మాయిలా నుదుటిపై చేతిని పెట్టుకుంది. డ్రెస్ అంతా మోడరన్ గా ఉంది.. బాడీ లాంగ్వేజ్ మాత్రం రివర్స్ లో ఉంది. ఇదో విభిన్న ప్రయత్నమని అనుకోవచ్చు. ఓవరాల్ గా కవర్ పేజి ఫోటో మాత్రం అదిరిపోయింది.

అంతే కాకుండా ఈ కవర్ పేజి ఫోటోపై రెజీనా క్యాప్షన్ కూడా ఉంది “నా ఉద్దేశంలో ప్రతి విజయం.. ప్రతి అపజయం క్షణికమే”. నిజమే కదా. పాసా ఫెయిలా ఒక్క క్షణంలో తెలుస్తుంది. అయితే పోస్ట్ రిజల్ట్ హంగామా మాత్రం చాలా రోజులు ఉంటుంది. ఇక రెజీనా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళంలో ‘కల్లాపార్ట్’.. ‘కసడ తపర’.. ‘ఇరుంబు తిరై 2’ అనే చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer