హాటు సీరీస్ లో ఇదొకటి

0

పంజాబీ భామ రుహని శర్మ సుశాంత్ సినిమా ‘చిలసౌ’ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ కాలేదు కానీ అటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఇటు హీరో హీరోయిన్లు సుశాంత్.. రుహానిలకు మంచి పేరు తెచ్చింది. అయితే రుహానికి ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ‘చిలసౌ’ లో పాత్ర ప్రకారం మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో నటించడంతో గ్లామర్ కు స్కోప్ లేకుండా పోయింది. ఆఫర్లు తన తలుపు తట్టకపోవడంతో రుహని గ్లామర్ గేట్లు ఓపెన్ చేసింది.

జస్ట్ గ్లామర్ గేట్లు ఓపెన్ చేస్తే కుదరదు.. ఆ ఫోటోలను ఫిలిం మేకర్లు చూసేలా చేయాలంటే సోషల్ మీడియా ఆయుధాన్ని వాడాలి. ఈమధ్య రుహాని శర్మ సరిగ్గా అదే పని చేస్తోంది. హాటు ఫోటో షూట్లు చేయడం ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేయడం.. నెటిజన్లను ఉడికించడం చేస్తోంది. రీసెంట్ గా అలానే కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సిమెంట్ కలర్ శాటిన్ గౌన్ ధరించి వయ్యారంగా నవ్వుతూ పోజిచ్చింది. గౌన్ చాలా పొట్టిగా ఉండడంతో కాళ్ళ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక రుహాని నవ్వు కూడా ఇన్స్టాగ్రామంలో తాపాన్ని పెంచేలా ఉంది.

ఇలాంటి ఫోటో షూట్లు చేస్తూ ఉంటే.. పనిలో పనిగా డోస్ కూడా కొంచెం కొంచెం పెంచుతూ ఉంటే టాలీవుడ్ నిర్మాతల కంట్లో పడడం ఖాయమే. ఇక రుహాని ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘కమల’ అనే మలయాళం థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కాకుండా హిందీలో ‘ఆగ్రా’ అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer