చి ల సౌ బ్యూటీ వెర్షన్ 2.0

0

పంజాబీ భామ రుహని శర్మ సుశాంత్ సినిమా ‘చిలసౌ’ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు మంచి పేరే వచ్చినప్పటి కీ రుహాని కి ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చి హాటు గేర్ వేసి ఇన్స్టా ను రఫ్ఫాడించింది. దీంతో రుహాని లోని బోల్డ్ కోణం అందరికీ తెలియడం తో ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి.

గ్లామర్ రూటు కు రావడంతో ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈమధ్య డోస్ పెంచింది. రీసెంట్ గా రుహాని ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూస్తే ‘చిలసౌ’ లో నటించిన రుహాని.. ఈ రుహాని ఒకరేనా అనే అనుమానం రావడం ఖాయం. ఇన్నర్ వేర్ కనిపించేలా ఒక పార దర్శకమైన ప్రింటెడ్ కలర్స్ గౌన్ ధరించింది. చిలిపిగా నవ్వుతూ పెదవుల దగ్గర చేతిని పెట్టు కొని పోజిచ్చింది. రుహాని హెయిర్ స్టైల్ ట్రెండీగా ఉంది. నిలుచున్న విధానం కూడా స్టైలిష్ గా ఉంది.ఈ భామ వాలకం చూస్తుంటే పక్కింటమ్మాయి ఇమేజికి పూర్తిగా బై బై చెప్పినట్టే ఉంది.

ఈ ఫోటో కు మంచి స్పందనే దక్కింది. “హాట్ ఏంజెల్”.”ఆసమ్ క్లిక్”.. “సెక్సీ డ్రెస్..” అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక రుహాని ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘కమల’ అనే మలయాళం థ్రిల్లర్ మూవీ లో నటిస్తోంది. హిందీలో ‘ఆగ్రా’ అనే మరో సినిమా లో కూడా నటిస్తోంది. ఇవి రెండూ కాకుండా తెలుగు లో నాని నిర్మిస్తున్న ‘హిట్’ సినిమా లో ఆఫర్ దక్కింది. ఈ సినిమా లో విశ్వక్ సేన్ హీరో.
Please Read Disclaimer