తెలుపు బికినీలో రూహి హంగామా

0

బాలీవుడ్ లో ఉన్న క్రేజీ బికినీ బ్యూటీల్లో రూహి సింగ్ ఒకరు. బికినీ బ్యూటీ అనగానే చాలామంది నలభైలలో ఉన్న మలైకా.. మందిరా అనుకుంటారు. కాదు కాదు. ఈ భామ జస్ట్ ట్వెంటీస్ బ్యూటీ. మధుర్ భండార్కర్ ‘క్యాలెండర్ గర్ల్స్’ తో రూహి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాలు చేసింది. ఆ సంగతేమో కానీ బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేయడంలో స్పెషలిస్టు.

ప్రస్తుతం ఈ భామ ఏ థాయ్ ల్యాండ్ లోనో ఫుకెట్ లోనూ ఉన్నట్టుంది. వెకేషన్ ను చక్కగా ఎంజాయ్ చేస్తోంది. లొకేషన్ ఎక్కడో చెప్పకపోయినా తన వెకేషన్ ఫోటోలను నెటిజన్లకు షేర్ చేయడం మర్చిపోలేదు. ఒక వైట్ కలర్ బికినీ ధరించి చేతిలో ఫోన్ పట్టుకుని వయ్యారంగా తెల్లటి ఇసుక ఉండే బీచ్ లో నిలుచుంది. వెనకేమో పచ్చటి చెట్లు.. పైనేమో నీలాకాశం.. తెల్లటి మబ్బులు. ఫోటో అదిరిపోయింది. పాప బికినీ చూస్తే.. అసలు ఈ భూమ్మీదకు రూహి రావడానికి ప్రధాన కారణం.. డెస్టినీ ఏంటంటే.. ఆ బికినీ ధరించడం కోసమేమో అనిపించేలా ఉంది. అంత పర్ఫెక్ట్ గా సూట్ అయింది. ఇక ఆమె విజన్ ఫిలిం మేకర్ల దగ్గర ఆఫర్లు సాధించడం..మిషన్ మాత్రం నెటిజన్లను నిద్రకు దూరం చేయడం.

ఈ ఫోటోకు ఈ ఆర్టికల్ సైజు లో పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. అదంతా అనువాదం చేస్తే కష్టం కాబట్టి రెండు ముక్కల్లో చెప్పుకుందాం.. “మనం మన జీవితం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఎప్పుడూ లేవు లేవు అని ఏడవకుండా మనకు ఉన్నవాటితో సంతోషంగా ఉండాలి. ఊరికే ప్రతిదానికి విమర్శించడం ‘కూల్’ గా.. ‘మేథావితనం’ గా పరిగణింపబడుతోంది కానీ అది మానేసి మన పనిని మనం ప్రేమిద్దాం. పాజిటివ్ గా ఉందాం” అంటూ సందేశం ఇచ్చింది. ఇక నెటిజన్ల రెస్పాన్స్ చూస్తే ‘హాటీ + ఫిలాసఫీ’.. ‘లుకింగ్ గ్రేట్’.. ‘క్యూటెస్ట్ బికినీ’ అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer