ఉల్టా పల్టా బికినీ!

0

రుహి సింగ్ పేరు తెలుసా? బాలీవుడ్ బ్యూటీ. మధుర్ భండార్కర్ సినిమా ‘క్యాలెండర్ గర్ల్స్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇష్క్ ఫరెవర్’ అనే సినిమాలో కూడా నటించింది. రూహి బాలీవుడ్ లో తెగ రచ్చ చేస్తున్న నలభైల ఆంటీల లిస్టులోని భామ కాదు. జస్ట్ ఇరవైల పాప. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు సునామీ తెప్పించగలదు.

మరోసారి అలాంటి సునామీ తెప్పించాలని డిసైడ్ అయిందేమో కానీ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “కెన్ యూ ఈవెన్?” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఎవరో జఫ్ఫాలు రూహిని కామెంట్ చేశారేమో.. వారికి ‘మీరు చేయగలరా?’ అంటూ కౌంటర్ ఇస్తున్నట్టుగా ఉంది. ఇది మన గెస్ మాత్రమే లెండి. ఇక ఫోటో విషయానికి వస్తే పోల్ డ్యాన్స్ చేసే బార్ పై ఓ ఎక్సర్ సైజ్ లాంటిది చేస్తోంది. తలకిందులుగా నిలబడి చేతులను నెలకు ఆన్చింది. కాళ్ళను పోల్ కు తగిలించింది. ఇక పోనీ టెయిల్ కాస్తా ఎంతో కళాత్మకంగా ఫ్లోర్ ను టచ్ చేస్తోంది. ఇలా ఉల్టా పల్టా పోజులు ఇవ్వడం ఊరికే ఫోటోను చూసినంత సులువైన విషయం కాదు. ఎంతో సాధన ఉంటే కానీ అలా చేయలేరు.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “ఆసమ్ స్కిల్”.. “ఉల్టా పల్టా పోజు సూపర్”.. “అమేజింగ్” అంటూ కామెంట్స్ పెట్టారు. ఒక నెటిజన్ మాత్రం “నా జాబ్ లో పొద్దున నుంచి రాత్రివరకూ నేను చేసేది ఇదే” అంటూ నిట్టూర్చాడు. ఇక రూహి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఒక్క ఆఫర్ కూడా లేదు. మరి ఈ ఉల్టా పల్టా పోజులు.. బికినీ ట్రీట్ లు చూసి ఎవరైనా మనసున్న మారాజు రూహికి ఒక ఆఫర్ ఇస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer