‘రూలర్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

0

బాలకృష్ణ 105వ చిత్రం ‘రూలర్’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రూలర్ కు సెన్సార్ క్లియరెన్స్ వచ్చేసింది. ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఇచ్చింది. యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండటంతో చిత్రానికి యూ/ఎ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య సినిమా పట్ల సెన్సార్ సభ్యులు పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అనఫిషియల్ గా చెబుతున్నారు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ సభ్యులు బిజీ అవ్వబోతున్నారు. బాలయ్యకు వరుసగా ఫ్లాప్ లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో చేసిన ఈ చిత్రం ఆయకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య మూడు విభిన్నమైన గెటప్స్ లో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా సోనాల్ చౌహాన్ మరియు వేదికలు హీరోయిన్స్ గా నటించారు. వీరితో రొమాన్స్ బాలయ్య ఏ స్థాయిలో చేశాడో చూడాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్.. భూమిక మరియు జయసుధ కీలక పాత్రలో నటించారు.
Please Read Disclaimer