రూలర్ తాజా లుక్!

0

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వం లో ‘రూలర్’ అనే చిత్రంలో నటిస్తున సంగతి తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య రెండు విభిన్న షేడ్స్ ఉండే పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటేమో స్టైలిష్ గా ఐరన్ మ్యాన్ గడ్డం గెటప్ ఉండగా మరో లుక్ లో ఫుల్ గడ్డం తో పోలీస్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నారు. బాలయ్య ఐరన్ మ్యాన్ గెటప్ కు మొదటి నుంచి మిశ్రమ స్పందనే దక్కింది. తాజాగా ఇదే గెటప్ లో ఉన్న మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది ‘రూలర్’ టీమ్.

ఈ పోస్టర్ లో బాలయ్య గళ్ళ చొక్కా.. క్రీమ్ కలర్ ప్యాంట్.. వెయిస్ట్ కోట్ ధరించి..గోల్ఫ్ ఆడుతూ ఉన్నారు. ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్ తరహాలో క్యాప్.. కూలింగ్ గ్లాసెస్ ధరించారు. అయితే ఈ లుక్ ఎందుకో బాలయ్య కు పెద్దగా సూట్ కాలేదని సోషల్ మీడియా లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘రూలర్’ సినిమా నుంచి విడుదలైన గత పోస్టర్లతో పోలిస్తే ఈ పోస్టర్ లో బాలయ్య స్టైలింగ్ సరిగా లేదని అంటున్నారు. బాలయ్య వెయిట్ తగ్గడం తో లుక్ లో తేడా వచ్చి ఉంటుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొందరు మాత్రం డిఫరెంట్ గెటప్ కాబట్టి అలా అనిపిస్తోందని.. సినిమాలో బాలయ్య స్టైలిష్ గా ఉంటారని అభి ప్రాయపడుతున్నారు. మరి సినిమా లో బాలయ్య ఎలా ఉంటారో వేచి చూడాలి.

ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా సోనాల్ చౌహాన్.. వేదిక నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ కంపోజర్ చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘రూలర్’ డిసెంబర్ 20 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer