రూలర్ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు!

0

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరో గా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. ఈనెల 20 వ తారీఖున ‘రూలర్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది ‘రూలర్’ టీమ్. ఇప్పటికే టీజర్.. పాటను విడుదల చేసిన ఫిలిం మేకర్స్ తాజాగా ‘రూలర్’ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు డేట్.. టైమ్ ఫిక్స్ చేశారు.

నిర్మాతలైన సీకె ఎంటర్టైన్మెంట్స్ వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక పోస్టర్ షేర్ చేస్తూ “భారీ యాక్షన్ ధమాకా మీ ముందుకు రానుంది. డిసెంబర్ 8 వ తేదీ ఉదయం 8 గంటల 19 నిముషాలకు రూలర్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం” అంటూ సమయం వెల్లడించారు. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లో బాలయ్య ఐరన్ మ్యాన్ స్టైల్ గడ్డంతో సైడ్ వ్యూలో స్టైలిష్ గా ఉన్నారు. పెయింటింగ్ లా కొన్ని కలర్స్ తో టచ్ ఇవ్వడం తో పోస్టర్ కు ట్రెండీ లుక్ వచ్చింది.

‘రూలర్’ టీజర్లో బాలయ్య యాక్షన్ అవతారం చూపించిన సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ తో ప్రేక్షకులను బాలయ్య తనదైన శైలిలో మెప్పిస్తారా లేదా వేచి చూడాలి. ఈ సినిమా లో బాలయ్య జోడీగా వేదిక.. సోనాల్ చౌహాన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. భూమిక.. జయసుధ.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకం పై నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer