రమ్ పమ్ బమ్: పర్ఫెక్ట్ డిస్కో పాట

0

మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైఫై యాక్షన్ ఫిలిం ‘డిస్కోరాజా’ ఈ సినిమా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు టీజర్లు.. రెండు పాటలు రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి రమ్ పమ్ బమ్ అంటూ సాగే డిస్కో స్టైల్ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.

‘డిస్కోరాజా’ సంగీత దర్శకుడు తమన్. ఈ పాటకు సాహిత్యం అందించినవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. పాడినవారు రవితేజ.. బప్పీ లహరి.. శ్రీకృష్ణ. “కాలం ఆగాలి నా కాలి వేగం చూసి లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి కొండలే ఊగి పోవాలి నా జోరుకి.. దిక్కులే పారిపోవాలి నా హోరుకి” అంటూ సింపుల్ పదాలతో సాగింది పాట సాహిత్యం. పాత బప్పీ లహరి పాటల స్టైల్ ను కొంచెం గుర్తు తెస్తూనే ఈతరం ఇన్ స్ట్రుమెంటేషన్ తో తమన్ సూపర్ ట్యూన్ ఇచ్చాడు. ఇక రవి తేజ పాట మధ్యలో “ఆఆ.. రమ్ ప బమ్ రబరిబ” అంటూ చేసిన హమ్మింగ్ పాటకు హైలైట్ గా నిలుస్తుంది. డిస్కో పాటకు ఈ హమ్మింగే అందాన్ని తీసుకొస్తుంది. అసలే సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ పాటతో కూడా తన ఫామ్ కొనసాగించాడు. మాస్ ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు కానీ స్లోగా అందరికీ నచ్చే పాట ఇది.

ఈ పాట వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. రవితేజ యాక్షన్ అవతారమే కాకుండా.. చివరి సీన్ లో సునీల్ బ్యాచ్ అంతా రెట్రో స్టైల్ లో ఒక బార్ లో డ్యాన్స్ చేస్తూ ఉండడం ఆకట్టుకుంటుంది. ఆలస్యం ఎందుకు.. వినేయండి. వీలైతే రబరిబ తబదిబ.. తబ్బబా అంటూ నోటికొచ్చిన పదాలతో హమ్మింగ్ చేసి డిస్కో కింగులుగా క్వీనులుగా మారిపోండి.
Please Read Disclaimer