ఆ దర్శకుడితో నాని అంతా ఉత్తిదే !

0

ప్రస్తుతం నేచురల్ స్టార్ తన 25వ సినిమాను ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో సుధీర్ బాబుతో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నెక్స్ట్ ఓ మూడు నాలుగు ప్రాజెక్ట్స్ పైప్ లో ఉన్నప్పటికీ ‘V’ పూర్తయిన తర్వాతే వాటిలో నెక్స్ట్ ఎంటనేది ఫైనల్ చేసుకుంటాడు నాని.

అయితే అనుకోకుండా నాని26వ సినిమా శివ నిర్వాణతో అంటూ సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ మేడ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ వదిలారు. అంతే కాదు సమంత హీరోయిన్ అంటూ ప్రొడక్షన్ హౌజ్ తో సహా డీటెయిల్స్ పెట్టారు. ఆల్మోస్ట్ అఫీషియల్ పోస్టర్ డిజైనింగ్ లానే ఉండటంతో అందరూ ఈ కాంబో ఫిక్సనుకున్నారు. ప్రొడక్షం హౌజ్ దర్శకుడి నుండి ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఇదే నాని నెక్స్ట్ సినిమా అంటూ వర్తలొచ్చేసాయి.

తీరాచూస్తే తన నెక్స్ట్ సినిమా గురించి ఓ రూమర్ స్ప్రెడ్ అయిందని అందులో ఎలాంటి నిజం లేదని త్వరలోనే నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ చెప్తా అంటూ దర్శకుడు శివ స్వయంగా ట్వీట్ చేసే సరికి ఇక అందరూ నాని26 వార్తను లైట్ తీసుకున్నారు. అయితే ఉన్నపళంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ తో నాని నెక్స్ట్ సినిమాను ఇలా వార్తల్లోకి తెచ్చిందెవరో..?
Please Read Disclaimer