రానాతో ఎఫైర్ .. రకుల్ టెన్షన్ టన్షన్

0

దగ్గుబాటి రానాతో రకుల్ ఎఫైర్ సాగిస్తోందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇది. గత కొంతకాలంగా రానా అనారోగ్యం గురించి విపరీతమైన ప్రచారం సాగించిన అదే వేదికపై అతడి లవ్ ఎఫైర్ గురించి ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది. రానా ఇంటి పక్కనే రకుల్ ఇల్లు ఉండడంతో ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం విపరీతంగా పెరిగిందిట. ఆ ఇద్దరూ సీక్రెట్ గా లవ్ ఎఫైర్ సాగిస్తున్నారని ప్రచారమవుతోంది.

అయితే ఇది నిజమా అంటే.. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రకుల్ కాస్త ఆందోళనగానే కనిపించింది. ఇంటి పక్కనే ఇల్లు ఉన్నంత మాత్రాన మా మధ్య ఎఫైర్ అంటగడతారా? రానా నాకు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే అంటూ రకుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఇన్నేళ్ల కెరీర్ లో రానా సరసన రకుల్ ఒక్కసారి కూడా నటించకపోయినా ఆ ఇద్దరి మధ్యా స్నేహం ఆసక్తికరమే. పరిశ్రమ స్నేహాల గురించి అభిమానులు అర్థం చేసుకోవడం అంత సులువేమీ కాదు.

ఇక గతంలో త్రిష.. బిపాస బసు లాంటి స్టార్లతోనూ రానా లింకప్ వార్తలు వేడెక్కించాయి. శ్రీయతోనూ రానా ఎఫైర్ అంటూ అప్పట్లో ప్రచారం సాగింది. అయితే రానా సరసన బిపాస.. శ్రీయ నటించారు అప్పట్లో. రానా- త్రిష జోడీగా కవర్ ఫోటోషూట్లు వేడెక్కించాయి. ఆ క్రమంలోనే ఆ పుకార్లు షికారు చేశాయి. తాజాగా ఈ జాబితాలో రకుల్ పేరు వినిపించడంపై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓవైపు అనారోగ్యం నుంచి బయటపడేందుకు విదేశాల్లో చికిత్స పొందిన రానాకు ఈ కొత్త తలనొప్పులేమిటో! అంటూ సోషల్ మీడియాలో మరో ప్రచారం వేడెక్కిస్తోంది.
Please Read Disclaimer