‘జబర్దస్త్’ కాలగమనంలో కలిసి పోనుందా?

0

ఒకప్పుడు టీవీ అంటే దూరదర్శిన్ మాత్రమే. ఆ తర్వాత ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ చాలా వచ్చాయి. ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లో ఎక్కువగా సీరియల్స్ మరియు సినిమాలు మాత్రమే ప్రసారం అయ్యేవి. కాని ఈటీవీ జబర్దస్త్ అనే కామెడీ షోతో తెలుగు బుల్లి తెర స్థితి గతులనే మార్చేసింది. దాదాపు 8 ఏళ్లుగా ఈటీవీ టాప్ లో ఉండటంలో జబర్దస్త్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. టీవీలో లేదంటే యూట్యూబ్ లో జబర్దస్త్ ను ప్రేక్షకులు ఈ 8 ఏళ్లు తెగ చూసేశారు.

జబర్దస్త్ ఇంతటి సక్సెస్ అవ్వడంలో కమెడియన్స్ కామెడీ చేయడం మాత్రమే కాకుండా యాంకర్ గా వ్యవహరించిన ముద్దుగుమ్మలు.. జడ్జ్ లుగా వ్యవహరించిన నాగబాబు మరియు రోజాలతో పాటు డైరెక్టర్స్ నితిన్ భరత్ లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరంతా కలిసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. నాగబాబు లేదా రోజా ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా రాకున్నా కూడా ఆరోజు షో వెలితిగా అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ సో సో అన్నట్లుగానే అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.

అలాంటిది నాగబాబు షో నుండి శాస్వతంగా తప్పుకుంటున్నారు అంటూ బుల్లి తెర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా పలు మీడియాల్లో ఈ విషయం ప్రముఖంగా వినిపిస్తుంది. జబర్దస్త్ ప్రొడక్షన్ హౌస్ అయిన మల్లెమాల వారితో డైరెక్టర్స్ భరత్ మరియు నితిన్ లు విభేదాల కారణంగా షో కు దూరం అయ్యారట. వారితో మంచి బాండింగ్ ఉన్న నాగబాబు కూడా వారి రూట్ లోనే బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. దాంతో పాటు వీరికి మరో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది.

జబర్దస్త్ నుండి నాగబాబు మాత్రమే కాకుండా మరి కొందరు కమెడియన్స్ కూడా వెళ్తారనే టాక్ నడుస్తోంది. నాగబాబుకు అత్యంత సన్నిహితులుగా ప్రచారం జరుగుతున్న సుడిగాలి సుధీర్.. హైపర్ ఆది మరియు చమ్మక్ చంద్రలతో పాటు మరికొందరు కమెడియన్స్ కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయట. ఇంతమంది జబర్దస్త్ నుండి బయటకు వస్తే మళ్లీ జబర్దస్త్ పూర్వ వైభవంను దక్కించుకోగలదా.. లేదంటే కాలగమనంలో కలిసి పోతుందా అనే అనుమానాలు.. చర్చలు జరుగుతున్నాయి.

జబర్దస్త్ తో పాటు ఈటీవీకే చెందిన మరో కామెడీ షో పటాస్ లో కూడా సంచలన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే శ్రీముఖి తప్పుకోవడంతో పెద్దగా రేటింగ్ రావడం లేదు. ఆ కారణంగానే యాంకర్ రవి కూడా మెల్లగా సైట్ అయ్యి పోవాలని భావిస్తున్నాడట. వీరందరితో ఒక ఛానెల్ చర్చలు జరుపుతుందని జబర్దస్త్ మరియు పటాస్ లాంటి ఒక మాంచి ఎంటర్ టైన్ మెంట్ పోగ్రాంను డిజైన్ చేసే పనిలో వారు ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. గతంలో జబర్దస్త్ కు పోటీగా ఒక కామెడీ షో వచ్చింది. కాని అది కనీసం సంవత్సరం కూడా కొనసాగలేదు. మరి జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన వారు షో ను ప్రారంభించినంత మాత్రాన ఆ షో సక్సెస్ అవుతుందా అనేది చూడాలి.
Please Read Disclaimer