ప్రభాస్ ప్రాజెక్ట్ సిల్లీ పుకార్లు

0

‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్ రేంజ్ స్టార్ డంను దక్కించుకున్న ప్రభాస్ హిందీ సినిమాలో నటించడం ఖాయం అంటూ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమద్య కరణ్ జోహార్ ఒక సినిమాను ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇటీవలే సాహోతో మరోసారి బాలీవుడ్ లో ప్రభాస్ తన సత్తా చాటాడు. ఈ సమయంలోనే ప్రభాస్ బాలీవుడ్ మూవీ గురించి ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘వార్’ చిత్రంకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారని.. ఆ సినిమాలో ప్రభాస్ ను ఒక హీరోగా తీసుకునేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ప్రయత్నాలు చేస్తున్నారనే పుకార్లు జాతీయ మీడియాలో వస్తున్నాయి.

వార్ సినిమాలో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ లు నటించారు. సెకండ్ పార్ట్ లో టైగర్ ష్రాఫ్ కాకుండా మరో హీరో నటించే అవకాశాలున్నాయట. హృతిక్ రోషన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్.. ప్రభాస్ సౌత్ లో సూపర్ స్టార్ కనుక ‘వార్ 2’ వీరిద్దరితో తీస్తే దుమ్ము లేసి పోవడం ఖాయం అంటూ కొందరు అనుకుంటున్నారట. ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్ వారు ప్రభాస్ ను సంప్రదించారనే ప్రచారం జరుగుతుంది.

మీడియాలో వస్తున్న పుకార్లు మరీ సిల్లీగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతానికి బాలీవుడ్ లో సినిమా చేసే ఆలోచనే లేదని సాహో ప్రమోషన్స్ లో కూడా చెప్పాడు. జాన్ చిత్రం తర్వాత కూడా తెలుగులోనే ప్రభాస్ సినిమా ఉంటుందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ప్రభాస్ ను సంప్రదించారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. వార్ 2 లో ప్రభాస్ నటించబోతున్నాడనే పుకార్లు సిల్లీ పుకార్లు అనిపిస్తుంది. వార్ 2లో ప్రభాస్ ఉంటే ప్రభంజనమే కాని అది నిజం కాకపోవచ్చని ఆయన అభిమానులు కూడా అనుకుంటున్నారు.