RDX బాంబులా ఉందే!

0

కొత్త హీరోయిన్లు చాలామందే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు కానీ మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకోవడం క్రేజ్ సాధించడం అరుదుగా జరుగుతుంది. అలాంటి ఫీట్ సాధించిన ముంబై భామ పాయల్ రాజ్ పుత్. ‘RX100’ లాంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ తన మొదటి సినిమాతోనే నటన విషయంలోనూ.. బోల్డ్ నెస్ విషయంలోనూ మంచి మార్కులు సాధించింది. అందుకే ఈ భామకు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి.

అయితే పాయల్ జస్ట్ ఆఫర్లతో సరిపెట్టుకునే రకం కాదు. తన క్రేజ్ ను వీలైనంతగా పెంచుకునేందుకు సోషల్ మీడియాను సాధనంగా వాడుతోంది. హాట్ ఫోటోషూట్లతో వీలైనంతగా వేడిని పెంచుతోంది. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పాయల్ ఫోటోను చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒకవైపుకు చూస్తూ ఒక సెన్సువల్ పోజిచ్చింది. ముంబై భామే అయినప్పటికీ ఈ ఫోటోలలో మాత్రం కేరళ కుట్టిలా కనిపిస్తోంది. పట్టులాంటి చర్మం.. తీరైన భుజాలతో తన హాట్ బ్యూటీ టాగ్ ను నిలబెట్టుకునేలాగా పోజిచ్చింది.

పాయల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘వెంకీమామ’ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ‘RDX లవ్’ అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది.. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజస్ హీరోగా నటిస్తున్నాడు.పైనున్న స్టిల్ ‘RDX లవ్’ చిత్రం లోనిదే. పేరుకు తగ్గట్టే ఈ భామ ఎక్స్ ప్లోజివ్ గా నటించినట్టుంది.
Please Read Disclaimer