కెరీర్ డౌన్ లో ఉన్న వారికి గీతా ఆర్ట్స్ ఆఫర్లు!

0

సినిమా ఇండస్ట్రీ లో విషయాల శాతం తక్కువ. అందుకే హిట్స్ లో ఉన్న నటీనటులకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి విషయంలో మినహాయింపులు ఉన్నట్టే ఈ అంశానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొందరు నిర్మాతలు మాత్రం హిట్లు ఫ్లాపులు పట్టించుకోకుండా టాలెంట్ మాత్రమే చూసి అవకాశాలు ఇస్తారు. అలాంటి వారిలో గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా ఉంటుంది.

కెరీర్ లో స్ట్రగుల్ అవుతున్న నటీనటులకు పెద్ద బ్యానర్లో అవకాశం వచ్చిందంటే అంతకంటే ఏం కావాలి. ‘RX100’ సినిమా తో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో కార్తికేయ. సినిమా సూపర్ హిట్ కావడం తో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వరసగా ఆఫర్లు వచ్చాయి. అయితే కార్తికేయ స్క్రిప్టుల ఎంపికలో తడబడడంతో ఆ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. ఈ సమయంలో గీతా ఆర్ట్స్ వారు కార్తికేయ తో ‘చావు కబురు చల్లగా’ సినిమా ను నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాతో నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి పేరును పరిశీలిస్తున్నారట. దాదాపుగా హీరోయిన్ ఛాన్స్ లావణ్యకు దక్కడం ఖాయమని అంటున్నారు. అది నిజమైతే లావణ్య కెరీర్ కు మంచి బోర్నవిటా దక్కినట్టే.. సారీ సారీ.. బూస్టు దక్కినట్టే. లావణ్య కెరీర్ ఆరంభంలో మంచి హిట్ల తో దూసుకు పోయింది కానీ గత కొంతకాలంగా వరస ఫ్లాపులతో వెనకబడింది. అయితే ఈమధ్య ‘అర్జున్ సురవరం’ సినిమా హిట్ కావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్ సినిమాలో నటిస్తోంది. ఇలాంటి సమయంలో గీతా ఆర్ట్స్ ఆఫర్ దక్కితే జాక్ పాట్ అనే చెప్పాలి.

ఈ లిస్టు ఇంతటితో ఆగలేదు. అటు బొమ్మరిల్లు భాస్కర్ – అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను కూడా గీతా వారు నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ పూర్తిగా డౌన్ లో ఉంది. ఇక అఖిల్ కెరీర్ కూడా కూడా అలానే ఉంది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. అక్కినేని అభిమానుల దన్ను ఉన్నప్పటికీ ఒక్క హిట్టు కూడా దక్కడం లేదు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ సినిమాతో మంచి బ్రేక్ దక్కుతుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer