సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కు సరిగ్గా ఏడాది!

0

‘RX100’ రిలీజై ఇప్పటికి కరెక్ట్ గా ఏడాది అయింది. సినిమా రిలీజ్ కు ముందు పాజిటివ్ బజ్ అయితే ఉంది కానీ సంచలన విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. దర్శకుడు అజయ్ భూపతి పై ప్రశంసల వర్షం కురిసింది. లిప్పు లాకుల దెబ్బకు విమర్శలు కూడా వచ్చాయి.

ఈ సినిమాతో హీరో కార్తికేయ.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు మంచి గుర్తింపు వచ్చింది. అందుకే ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పాయల్ రాజ్ పుత్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ‘RX100’ పోస్టర్లు.. తమ ఫోటోలు ఉన్న ఇమేజ్ ను పోస్ట్ చేసింది. ఆ సినిమా ఆడిషన్ కు హాజరైన రోజు తనకు ఇంకా గుర్తుందని తెలిపింది. ఛాలెంజింగ్ రోల్ అయినప్పటికీ యాక్సెప్ట్ చేశానని.. తనకు అంతకంటే మంచి అవకాశం దొరకదని తెలిపింది. అజయ్ భూపతికి.. తెలుగు ఇండస్ట్రీకి.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. హీరో కార్తికేయను తన ఫేవరెట్ కో స్టార్ అని పేర్కొంటూ ‘RX100’ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పింది.

పాయల్ ఎమోషనల్ పోస్ట్ సంగతి పక్కన పెడితే RX100 టీమ్ ప్రస్తుతం ఏం చేస్తున్నారో చూద్దాం. దర్శకుడు అజయ్ భూపతి నెక్స్ట్ సినిమాను ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. కార్తికేయ ‘హిప్పీ’ అనే సినిమాలో నటిస్తే అది డిజాస్టర్ గా నిలిచింది. అయితే కార్తికేయ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. మరోవైపు పాయల్ ‘RX100’ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక క్యామియో.. ‘సీత’ లో బుల్ రెడ్డి ఐటెం సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం ‘వెంకీమామ’.. ‘డిస్కోరాజా’ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer